Posts

బార్యని వేదిస్తున్నాడని కేసు పెడితే, కేసు పెట్టిన పోలిసులు ని వేదించాడట!

                                                              అయన ఒక పోలిస్ కానిస్టేబుల్ . ఖమ్మం జిల్లా ,అశ్వాపురం  పోలిస్ స్టేషన్ లో ఉద్యోగం. మగాడు అంటే మగాడే ! అతనికి  పురుష ఆదిపత్య సమాజం ద్వారా సంప్రాప్తించిన అహంకారం ఉంది. దానికి తోడు ప్రజల మీద జులుం చేసే అదికారం ఉందనుకుంటున్న పోలిస్ ఉద్యోగమూ ఉంది. అందుకే ఒఆ అతనికి పెళ్లాం అంటే కొంత చిన్న చూపు ఉందేమో ఆమెను వేదించటం మొదలు పెట్టాడు . నేరస్తులును చూసినట్లే ఆమెను చూసి ఉంటాడు, అందుకే ఆమె ఆ వేదింపులు తాళలేక భర్త మీద కేసు పెట్టింది. "ఓఆ  సో స్, ఎంత దైర్యం ! అసలే పోలీసుని ,అందులో తాళి కట్టిన మొగుణ్ణి నామీదే కేసు పెడతావా అని కారాలు మిరియాలు నూరాడట. అయిన నేను పోలిసునే కదా నన్నెవరు అరెస్ట్ చేస్తారులే అనుకున్నట్లుంది పాపం.  కానీ ఖమ్మం జిల్లా S.P  గారు అయిన ఆవుల రంగనాద్ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరుంది. కాబట్టి క్రింది స్తాయి అధికారులు కూడా జాగర్తగనే ఉంటున్...

కనీసం" ఎర్రబస్సులో " ఉన్న రక్షణ అవకాశం కోటి రూపాయల "వోల్వో బస్సులో " లేదన్న మాట !

                                                                    ఈ  రోజు  ఉదయం లేవగానే ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. బెంగుళూర్ నుండి హైదరాబాద్ వస్తున్న "జబ్బార్ ట్రావెల్స్ ' కి చెందిన వోల్వో బస్ మహబూబ్ నగర్ జిల్లా , పాలెం అనే గ్రామం వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం వాళ్ళ, కల్వర్ట్ కు గుద్దుకుని 45 మంది సజీవ దహనమయ్యారని  తెలిసి మనసు అంతా బాదతో నిండి పోయింది .    అది కోటి రూపాయలు ఖరీదు చేసే వోల్వో బస్ అంటా .ఎ.సి. బస్ పూర్తిగా మూసి వేయబడి  ఒక్క డ్రైవర్ వద్ద డోర్ మాత్రమే ఉంటుంది. సాదారణ బస్సుల్లో మాదిరి మాన్యువల్   ఏమర్జెన్సీ డోర్ లు లాంటివి ఏమి ఉండవు అనుకుంటా . ఏందుకంటే రవణా శాఖ వారి ద్రుష్టిలోకోటి రూపాయల ఎ.సి. బస్సులకు ప్రమా...

తమిళనాడులో కుష్బూ ! తెలంగాణాలో సోనియా ! ఇద్దరూ దేవతలే!

                                                               దేవత అంటే ఎవరు? ఈ   ప్రశ్న  కు బదులివ్వండి అని అని తెలంగాణా కాంగ్రెస్ వారిని అడిగితె  తడుముకోకుండా  ఠక్కున చెప్పే సమాధానం "సోనియా గాందీ ". ఎందుకంటే వారికి రాజకీయ పునర్జన్మ ఇచ్చింది ఆమె అని వారి ప్రగాడ విశ్వాసం మరి!. అయిదు కోట్ల మంది అరుపులను ఆఫ్ట్రాల్  అని తన జన్మ దిన కానుకగా ప్రకటించిన "తెలంగాణా" రాష్ట్ర ఏర్పాటుకు ఆమె పార్టీ కట్టుబడి ఉండేలా చేసినందుకు ఆమె కు తెలంగాణా కాంగ్రెస్ వారు జీవితాంతం చాకిరి చేసినా వారి రుణం  తీరదు కాక తీరదు . కాబట్టే వారు ఆమెకు తమ గుండెల్లో గుడి కట్టారు. ఆ అభిమానాని వారు బహిరంగంగా ప్రదర్శించారు కూడా !.  తెలంగాణా లో కె,సి,ఆర్  గారు తెలంగాణా తల్లి ఆ...

ఉప్పెనతో ఊళ్లు కొట్టుకుపోతుంటే,'ఉత్సవ సభకు 'రమ్మంటునాడు 'ఉత్త'రాకుమారుడు !.

                                                          ఈ   రోజు  టి.వి. చానళ్ళు చూసారా , 'ఊరిదంతా ఒక దారి అయితే ,ఉలిపికట్టెది ఇంకో దారీ' అన్నట్లు ఉంది ,ఒక చానల్ వారు చెసే ప్రసారాలు చూస్తుంటే . అన్ని చానల్లోను సింహబాగం ,గత మూడు రోజులుగా రాష్ట్రాన్ని ముంచెతుతున్న వర్షాలు, వాటి వలన ప్రజలకు కలుగుతున్న కష్ట నష్టాలు గురించి ప్రసారం చేస్తుంటే , ఒకే ఒక చానల్ మాత్రం హైదరాబాద్లో జరుగబోతున్న "సమైఖ్య శంఖారావం " సభ గురించి ప్రసారాలు చేస్తుంది.            "ఉప్పెనలా కదలి రండి"            "ఊరువాడాఏకమై రండి"            "తెలుగుతల్లి విలపిస్తుంది "  ...

విభజన వాదుల్లో ఉన్న సమైక్యతా బావం ,సమైక్య వాదుల్లో లేకపోవడం విడ్డూరం!

                                                      ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. తెలంగాణా నాయకులు మొన్నటిదాక ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ వారు ప్రకటించినప్పటి నుంచి ఏ పార్టీ వారు కూడా   తెలంగాణాలోని ఇతర పార్టీల వారి మీద పెద్దగా విమర్శలు చెయ్యడం లేదు సరికదా, సిమాంద్రా  నాయకుల వాదనలను సమైక్యంగా ,సమర్దవంతంగా తిప్పికొడుతున్నారు . రాష్ట్ర ఏర్పాటు విషయంలోను వారు పైకి పార్టీల పరంగా ఏమనుకున్నా, అందరూ అవసరమైనప్పుడు అయిక్యంగానే ప్రవర్తించారు . దీనికిగాను సీమాంద్రా ఉద్యోగుల నాయకుడు అశోక్ బాబు కూడా , తమ ప్రాంత నాయకుల అనైక్యతను ఎత్తి చూపే అనేక సందర్బాలలో  ప్రస్తావించడం గమనార్హం.   ఇకపోతే సీమాంద్రా నాయకులలో, పేరుకే సమైక్యతా రాగం . కానీ శ్రుతి వేరు,తా...

మా ఇల వేల్పు గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం" గురించి E.T.V 2 వారు ప్రసారం చేసిన "తీర్దయాత్ర" కార్యక్రమం చూడండి

Image
                                                        మొన్న 19-9-2013 వ తారీకున E.T. V. 2  వారు తమ తీర్ద యాత్ర కార్యక్రమం ద్వారా మా ఇలా వేల్పు అయిన శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ వారి దేవాలయం, గార్లఒడ్డు గ్రామం, ఏనుకూర్  మండలం, ఖమ్మం జిల్లా ,గురించి ప్రసారం చేసారు. అయితే ఒక చిన్న పొరపాటు టి. వి. వారు చేసినది ఏమిటంటే మా ఇలవేల్పు వేంచేసిన మా స్వగ్రామం పేరు "గార్లఒడ్డు" అయితే "గార్ల" అని ప్రకటించటం జరిగింది. దానికి గాను వారిని పొరపాటు సరిదిద్దవలసినదిగా కోరటం జరిగింది. ఏది ఏమైనా ఇది మా ఇలవేల్పు దేవాలయంనకు సంబందించింది కాబట్టి మా బ్లాగు మిత్రులు , వీక్షకులు ఆ దేవదేవుని దర్శన బాగ్యం కలిగించాలనే  ఈ  వీడియో లింక్ ను ఇవ్వడమైనది.మా బ్లాగులో 400 వ టపాగా మా ఇలవేల్పు గురించిన సమాచారం ప్రచురించడం నా అదృ...

మనిషి కమ్యూనిస్ట్! మనసు మాత్రమే "కరెన్సీ ఇస్ట్"!

                                                                   మనిషిని చెప్పె మాటలు బట్టి కాక, చేసె పనులు బట్టి అంచనా వెయ్యాలి.ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఏ వ్యక్తి అయినా తన సహజ గుణానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేడు. అలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది నటన అయి ఉండాలి. మన దేశం లో నిజాయితీ,నిబద్దత కలిగిన రాజకీయ నాయకులు అన్ని పార్టీలలో ఉన్నారు. కాకపొతే వెనుకటి తరంలో అలాంటి వారు ఎక్కువుగా ఉంటే, ప్రస్తుత కాలంలో వేళ్ల మీద లెఖ్ఖ పెట్టగలిగే స్తాయికి వచ్చారు.  ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అంటే మిగతా వారికన్నా ఎంతో నిజాయితీ పరులు అయి ఉండే వారు. వెనుకటి తరంలో అటువంటివారు చేసిన సేవల వలనే ఈ నాటికి దేశంలో ఆ పార్టీలు బ్రతికి ఉన్నాయి. కానీ నేతి బీరకాయలో నేయి ...