కనీసం" ఎర్రబస్సులో " ఉన్న రక్షణ అవకాశం కోటి రూపాయల "వోల్వో బస్సులో " లేదన్న మాట !
ఈ రోజు ఉదయం లేవగానే ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది. బెంగుళూర్ నుండి హైదరాబాద్ వస్తున్న "జబ్బార్ ట్రావెల్స్ ' కి చెందిన వోల్వో బస్ మహబూబ్ నగర్ జిల్లా , పాలెం అనే గ్రామం వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం వాళ్ళ, కల్వర్ట్ కు గుద్దుకుని 45 మంది సజీవ దహనమయ్యారని తెలిసి మనసు అంతా బాదతో నిండి పోయింది . అది కోటి రూపాయలు ఖరీదు చేసే వోల్వో బస్ అంటా .ఎ.సి. బస్ పూర్తిగా మూసి వేయబడి ఒక్క డ్రైవర్ వద్ద డోర్ మాత్రమే ఉంటుంది. సాదారణ బస్సుల్లో మాదిరి మాన్యువల్ ఏమర్జెన్సీ డోర్ లు లాంటివి ఏమి ఉండవు అనుకుంటా . ఏందుకంటే రవణా శాఖ వారి ద్రుష్టిలోకోటి రూపాయల ఎ.సి. బస్సులకు ప్రమా...