Posts

మనకు కావల్సింది "కుల సోషలిజమా?లేక వర్గ సో(శో)షలిజమా?

Image
                                                          మన దేశంలో కుల నిర్మూలన జరగాలని కలలు కన్న వారు కను మరుగై పోయారు.మన బారత రాజ్యాంగ నిర్మాతలు, కుల రహిత, మత రహిత వ్యవస్తను నిర్మించాలన్న అవేశంతో వాస్తవాలను మరచి, ఆదర్శ రాజ్యాంగం నిర్మిస్తే, అది ఆదర్శంగానే అధికార కాకి లెక్కలకు పరిమితమై, సోషలిజం వస్తుందని కలలు కంటే అది "శోష" లిజం గా మారి పోయింది.   కుల వ్రుత్తులకు పేటెంట్ హక్కులు లేకపోవడం వలన, ఎదుటివారి లాబసాటి కుల వ్రుత్తులనబడేవాటినైతే స్వీకరించారు కాని, ఎదుటివాడి కులాన్ని మాత్రం స్వికరించలేక పోయారు.ఇంతకంటే పచ్చి అవకాశ వాదం ఎక్కడైనా ఉంటుందా?   నిజానికి వ్రుత్తులను బట్టే కులాలు ఏర్పడ్డాయి. అసలు వ్రుత్తే చెయ్యనపుడు ఇంకా కులం అనేది ఎక్కడ ఉంటుంది? కాని ఉంది! ఎందుకంటే కులం అనే దానిని వ్రుత్...

"నిర్బయ" ఉదంతం తర్వాతే మన దేశంలో అత్యాచారాలు ఎక్కువయాయా!?

                                                                 చూడబోతే అలానే అనిపిస్తుంది. నిర్బయ కేస్ తర్వాత, దేశ ప్రజలలో చెలరేగిన ఆందోళన , ఆ తర్వాత జరిగిన చట్ట సంస్కరణల వలన, స్త్రీల పై జరిగే అత్యా చారాలకు కటీన శిక్షలు విదించేటట్లు, చట్టాలు రావడం వలన ఖచ్చితంగా కామాందులలో భయం అనేది పుట్టి ,అత్యాచారాల క్రైం రేట్ తగ్గుతుందేమోనని బావించిన వారికి నిరాశే మిగులుతుందనుకుంటా!   ఈ మద్య ఒక కేసు విచారణ సందర్బంగా డీల్లీ హై కోర్ట్ వారు కూడ ఈ విషయం లో ఆందోళన వ్యక్త పరచారు. ఈ మద్య విపరీతంగా పెరిగిపోతున్న స్త్రీల మీద లైంగిక దాడులు గురించి , వాటికి కారణాలు గురించి సమగ్ర అద్యయనం జరగాలన్నారు. అవును ఇది అక్షరాల సత్యం. మూలం కనుక్కోకుండా, పై పై పూతలు, మందులు రొగాన్ని తగ్గించనట్లే, వే...

న్యాయ శాఖా మంత్రిని చాచి కొట్టిన సి.బి.ఐ.

Image
                                                                            బారతదేశ అత్యున్నత నేర దర్యాప్తు సంస్త మన సి.బి.ఐ. ఈ మద్య కాలంలో అది రాజకీయ సంకెళ్ళు తెంచుకుని "స్వతంత్ర దర్యాప్తు సంస్థ" అనే పేరును సార్థకం చేసుకోవాలని తహ తహ లాడుతున్నట్లుంది. అందుకే "బొగ్గు కుంభ కోణం కేసులో సుప్రీమ్ కోర్టు వారికి ఇచ్చిన అపిడవిట్ లో, తాము నివేదికను న్యాయ శాఖా మంత్రి చూశాకే ,కోర్టులో సమర్పించామని, ఇకనుండి అలా చెయ్యమని చెప్పింది. అంతకు ముందు ఇదే విషయం మీద ప్రభుత్వం  తాము సి.బి.ఐ. వారి విచారణ నివేదికలో జ్యోక్యం చేసుకోలెదని చెప్పిందట!కాని సి.బి.ఐ. మాత్రం నిజం వెళ్ళగక్కి, రాజకీయ జ్యోక్యాన్ని అత్యున్నత న్యాయస్తానం  ముందు ...

మన దేశం లో "డేటింగ్" ని" లేచిపోవడం" అంటారా!

                                                                    పద్దెనిమిది యేండ్లు నీండితే చాలు ఏమి ఎంజాయి చేసినా, చెయ్యక పోయినా "వయస్సు" ని ఎంజాయి చెయ్యవచ్చు. నేను మొన్నటి దాక డేటింగ్ అనేది విదేశి సంస్క్రుతి, మనకు అలాంటి విదానం లేదు కాబట్టి,మన వివాహ వ్యవస్త చాలా వరకు స్వచ్చంగా ఉందని అనుకునే వాడిని.   మనలో చాలా మంది పెద్దలు అనబడే వారు, చెప్పేది చెయ్యరు, చేసేది చెప్పరు.వారు ప్రజలకు ఇచ్చే సందేశాలు వేరుగా ఉంటాయి,తాము ఆచరించే విదానాలు వేరుగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం తాము నిజమని నమ్మిన దానిని ప్రజలకు చెప్పే దైర్యం లేకపోవడం.ఉదాహరణకు కొన్ని వందల సినిమాలలో ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో లేపుకుపోవడం "హీరోఇజం" గా ప్రదర్సించి యువతరం చేత వహ్వా అనిపించుకున్న హీ...

'శాడిజం' కి' రాడిజం 'మాత్రమే కరెక్ట్!

Image
  వంద సార్లు చెప్పు, వేయి సార్లు చెప్పు,లక్షసార్లు చెప్పినా "లైంగికాసురులు" మారరుగాక మారరు. ముఖ్యంగా చిన్న పిల్లమీద లైంగిక దాడి చేసే నీచులుకి ఏమి చెప్పినా ప్రయోజనం ఉండదు. మొన్న డిల్లీలో జరిగిన అయిదేళ్ళ పాప మీద లైంగిక దాడి రోజూ దేశంలో జరుగుతున్న వాటిలో ఒకటి మాత్రమే. అయితే అక్కడ ప్రజలు అంతగా తిరగబడటానికి కారణం, మూడు నెలల క్రితం జరిగిన "నిర్భయ" ఉదంతం నుండి డిల్లీ పోలిసులు గుణపాటం నేర్చుకోపోవడం ప్రజల ఆగ్రహానికి కారణమయింది.    ఒక చేతకాని వెదవ చిన్న పిల్లను హీంసిస్తే, దాని మీద కేసు నమోదు చెయ్యలేని పోలిసుల వెదవతనానికి పెల్లుబుకిన నిరసన అది.లైంగికంగా అసమర్దులైన వారు,తమ అసమర్దతను కప్పిపెట్టుకోవడానికి,ఇటువంటి శాడిస్ట్ పనులు చేస్తుంటారు. చిన్నపిళ్ళలు వీరు చేస్తున్న పని చూసి బాదతో భయంతో విల విల లాడుతుంటే,అది చూసి శాడిస్ట్ల మగ అహంకారం త్రుప్తిపడుతుంది. ఇది ఖచ్చితంగా మానసికి సమస్యే అయినప్పటికి ఆ కారణం తో వారిని కటినంగా సిక్షించే విషయమ్లో  జాలి చూపించాల్సిన అవసరం చట్టానికి ఉండకూడదు.    ఈ మద్య ఇటువంటి బాల లైంగిక వేదింపుల  కేసులు బాగా పెరిగి పోతున్నాయి. దీనికి...

యుగ యుగాలకు, ఆలు మగలకు ఆదర్శం "సీతారామ దాంపత్యం"

Image
                                                                                                        యుగ యుగాలకు, ఆలు మగలకు ఆదర్శం "సీతారామ దాంపత్యం" అలు మగల అనుబందానికి సీతారామ దాంపత్య జీవితం చక్కని ప్రతీక.కస్ట సుఖాలలో బార్యాబర్తలు ఎలా పాలు పంచుకోవాలో తెలిపే వీరి దాంపత్య జీవనం మనకి ఆదర్శం. రాజ రికంలో పుట్టినప్పటికి, దర్మం కోసం వీరు అనుబవించిన కస్టాల ముందు మనవి ఒక లెఖ్ఖా?నిత్యం ఈ దేవతా మూర్తులను కొలిచే మనలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే,సంసారాలను విడాకుల వరకు తీసుకు వెళ్లడం ఎంతవ...

తాగితే ఆడ ఐనా, మగ ఐనా ఒకటే!

                                                                      మొన్న రెండు  చోట్ల వేర్వేరు ఘటనలు జరిగాయి.మొదటిది తెనాలిలో తాగుబోతులైన యువకులు ఒక అమ్మాయిని అల్లరి చేసే క్రమంలో ఆమె తల్లిని లారీ క్రిందకు నెట్టి చంపారని పోలిస్ వారి సమాచారం. అలాగే హైద్రాబాదులో కొంతమంది అమ్మాయిలు పబ్బులో ఫుల్ గా తాగేసి, అర్థరాత్రి రోడ్డు మీదకు వచ్చి వీరంగం వేసి మీడియా వాళ్ళ మీద దౌర్జన్యం చేసారని వార్తలు.   అర్థరాత్రి స్వాతంత్ర్యం గురించి గాంది గారు కన్న కలలు మనవాళ్ళు ఇలా నిజం చేస్తున్నందుకు ఎలా సిగ్గుపడాలో తెలియడం లేదు.అర్థరాత్రి ఒంటిగంట వరకు బారులకు లైసెన్స్ లు ఇచ్చిన ఈ సెన్స్ లేని పాలకుల వల్ల జరిగే అనర్థాలు ఇవి అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసిన, అసలు తాగ...