మన అభివ్రుద్ది కోసం "సూర్య నమస్కారం" చెయ్యక తప్పదు!
O Prajapati, you alone have encompassed all these created things:
May that for which with longing we have called upon you be ours;
May we become lords of wealth. (Rig Veda 10.121)
మొన్న హోళీ సంబరాల వేళా మన రాష్త్ర ప్రథమ పౌరులు, గవర్నర్ అయిన మాన్యులు శ్రీ నరసింహన్ గారు అమూల్యం,అమోఘమైన సూచన రాష్త్ర ప్రజలకు చేసారు. అదే ప్రతి కుటుంబం "సౌర శక్తి" ని వినియోగించుకుని అటు స్వీయ అవసరాలతో పాటు సామాజిక అవసరాలు తీరుస్తూ, దేశాభివ్రుద్దికి తోడ్పడమని వారు ఇచ్చిన సలహా ఎంతో ఆచరణీయమైనది. ఒక దేశం ఒక్క బౌతికాభివ్రుద్ది, ఆ దేశం లో ఉత్పత్తి అయ్యే విద్యుశ్చక్తి మీద ఆదార పడి ఉంటుంది అనేది నిజమే అయితే ప్రస్తుత తరుణంలో మరియు భవిష్యతులో కూడ "సౌర శక్తి" ఉత్పత్తి మనకు అనివార్యం.ఈ విషయం లో గుజరాత్ రాష్త్రం మన దేశానికి ఆదర్శం గా నిలిచి, మార్గదర్శనం చేస్తుంది.
మనం "త్రిమూర్తులు" ను ఆరాధించక పూర్వమే "సూర్య భగవానుడు" ని ఆరాదించిన వారం. అసలు దేవుడుని ఏక రూపం లో అదీ సూర్యుడి రూపంలో పూజించాం. త్రిమూర్తులు కంటే ముందు మనం ఆరాధించింది " "ప్రజాపతి". అనబడే సూర్య భగవానుడిని మాత్రమే.క్రమేణా మన పూర్వికులు ఎవరి ఇచ్చానుసారం వారు తమ తమ సొంత దేవుళ్లని స్రుష్టింప చేసుకున్న క్రమంలో ఉద్బవించిన వారే " త్రిమూర్తులు" మరియు ఇతర దేవాతా మూర్తులు. ఆ పరంపర నేటికి కొన సాగుతునే ఉంది. కాని ఆది భగవానుడు అయిన ఆ సూర్యుడు యొక్క శక్తిని ఈ నాటికి మనిషి గ్రహించి, దానిని సద్వినియోగ పర్చుకోవడానికి ఉద్యుక్తుడు కావడం ముదావహమ్.
కాబట్టి భారతీయులమయిన మనం "సౌర శక్తి" ని వినియోగించుకోవడం మన విద్యుక్త దర్మంగా బావించాలి. భగవత్ భక్తులైన దనిక వర్గాల వారు, "సౌర శక్తి" ప్రాజెక్ట్ లకు దనం దానం చేయ్యడం "సూర్య నమస్కారం" గా బావించాలి. "మానవ సేవే మాదవ సేవ’ అన్నట్లు, "సౌర శక్తి దానమే నిజమైన గాయత్రి జప మంత్రం" అని బావించండి. పూర్వ కాలం లో ఏ భగవానుని పూజించి మన పూర్వికులు సకల సౌభాగ్యాలు పొందారో ఆ దేవ దేవున్ని కొలిచి ఆయన శక్తితో మనం కూడ సకల సౌబాగ్యాలు పొందుదం గాక.
మరిన్ని వివరాలకు ఈ లింక్ ని క్లిక్ చెయ్యగలరు http://ssmasramam.blogspot.in/2012/08/who-is-prajapati-view-on-rig-veda-god.html .
Comments
Post a Comment