ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )
చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. జరుగుతున్నాయి. వాటిని అర్థం చేసుకోవడం అన్ని సార్లు,అందరికి సాద్యపడక పోవచ్చు.ఒక భొయవాడు "రామాయణ కర్త" గా మారినా,ఒక్క పక్కా నాస్తికుడు,"భక్త కన్నప్ప" గా మారినా దాని వెనుకాల ఏదో ఒక పరమార్థం తో కూడిన "దైవ లీల" ఉంటుంది.మహ మహా సైంటిస్ట్ లు సైతం వ్యక్తిగతంగా దైవం మీద నమ్మాకం కలిగి ఉన్నారంటే వారిలో స్వార్థమో, భయమో ఉందని కాదు. అదొక తెలియని ఏదో ఒక శక్తి వారి వెనుకాల ఉండడమే.దీనికి ప్రబల ఉదాహరణే మా తండ్రి గారి జీవితం. కీ.శే. మద్దిగుంట తిరుపతయ్య మా తండ్రి గారు కీ.శే. మద్దిగుంట తిరుపతయ్య గారిది క్రిష్ణా జిల్లాలోని కవులూరు అనే గ్రామం. అయన ఒక వెనుక బడిన తరగతికి చెంద...