ఫేస్ బుక్ కుర్రాడ్ని పెండ్లాడితే ఫేస్ అంతా బ్లేడ్ తో ముద్దులు పెట్టాడట!.
మన వివాహరీతులు మారిపోతున్నాయి. సాంప్రాదాయ పద్దతి ప్రకారం పెంద్లికి ముందే వదూ వరుల కుటుంభ పెద్దల్లు ఆటు ఏదు తరాలు, ఇటుఏడు తరాలు చూడాలనే పాత పద్దతిలో కాకపోయిన వ్యక్తిగతంగా పిల్ల లేక పిల్ల వాడు ఎటువంటి వారుఅనే వాటితో పాటు పిల్లా, పిల్లవాడి కుటుంభాలు ఎటువంటివి? వారికి సమాజంలో, బందువులలో ఎటువంటి పేరు ఉంది?సౌమ్యులా? తగాదాల మారి కుటుంబాలా? అనే వాటిని కూలం కషంగా ఎంక్వైరీ చేసిం తర్వాతే వివాహాలు కుదుర్చుకుంటారు. వ్యక్తిగత స్వేచ్చ పేరుతో విపరీత దోరణులు అవలంభిస్తున్న నేటి యువతరం నైజం చూస్తుంటే పూర్వ కాలం వారి కంటే , ఈ కాలం వారే పెండ్లి సంబందాలు విషయం లో ఎక్కువ జాగర్తలు తీసుకోవాలనిపిస్తుంది. ఈ మద్య కుర్ర కారు సామాజిక వెబ్సైట్లైన ఫేస్ బుక్ లాంటి సైట్ లలో పరిచయాలు పెంచుకోవటానికి తహ తహ లాడుతున్నారు. కొంత మందయితే ఆ పరిచయాలనే ప్రణయంగా మార్చుకుని పరిణయం దాక వెళుతున్నారు. వదూవరుల సమాచారం కొరకు ఫేస్ బుక్ లను ఉపయ...