ఆశిష్ నంది ఒక పేరొందిన సామాజిక వేత అంట! ఈయన గారి ఇతర సామాజిక సిద్దాంతాలు గురించి నాకు తెలియదు కాని , ఈ మద్య ఆయన గారు సూత్రీకరించిన ఒక సిద్దాంతం వింటే నాకు మైండ్ బ్లాంక్ అయింది. ఆయన గారి సిద్దాంతం లేక అభిమతం ఏమిటంటే ఈ దేశం లో పెరిగిపోతున్న అవినీతికి నిమ్నవర్గాల వారే కారణమంట. దీనికి గాను ఆయన పశ్చిమ బెంగాల్ని ఉదాహరణగా చూపిస్తూ, గత వందేళ్లుగా అక్కడ నిమ్నవర్గాల వారెవ్వరూ, అదికారం దరిదాపుల్లోకి రాకపోవడం వల్లే, అక్కడ అవినీతీ తక్కువుగా ఉందని తేల్చేశారు మహా సామాజిక శాస్త ఘనాపాటి గారైన నంది గారు. నేను ఈ విషయం లో ఎక్కువు లోతులోకి వెళ్లి విశ్లేషించ దల్చుకోలేదు. ఆయన గారు తన సూత్రీకరణకు పశ్చిమ బెంగాల్ని ఉదాహరణగా చెప్పారు కాబట్టి, ఒక వేళా అదే నిజమయితే, ఆయన గారి సిద్దాంతం ఆంద్రా, కర్ణాటక లలో ఎందుకు ఫెయిల్ అయింది? ఆయనే సమాదానం చెప్పాలి.ఈ రెండు రాష్ట్రాల్లో, ఇటీవలి పరిణామాలు గమనిస్తే, గత వందేళ్లుగా ఎంత అవినీతి జరిగిందో పదేళ్లలో అంత అవినీతీ జరిగింది. ఆ అవినీతికి మూల కారకులు, ఒకే సామాజిక వర్గానికి చెంది...