మొదట్లో స్త్రీలను పూజించమన్న "మనువాదం " ప్రక్షిప్తమవడానికి, "బడ్డు బైరాగి వాదం " కారణం కాదా ?
నేను ఇదే బ్లాగులో వెనుకటి టపాలలో చెప్పినట్లు, ప్రస్తుతం మనకు లభిస్తున్న "మనుధర్మం " అనే గ్రందం ఒకరి చేత రచింపబడినట్లు కనపడటం లేదు. మనువు రాసిన మూల గ్రంధాన్ని ఆ యన తర్వాతి రచయితలు లేక రుషులు అప్పటి కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ రావడం చేతనే అందులోని ఒక శ్లోకానికి , మరొక శ్లోకానికి వైరుధ్యాలు ఏర్పడి ఒక దానికొకటి పొంతన లేకుండా పోయింది . ఇది మనుదర్మం ని ఆసాంతం జాగర్తగా పరిసీలించే వారివారి కైనా ఇట్టె అర్దమవుతుంది . క్రమబద్దమైన జీవన విదానం గురించి ప్రస్తావించిన నా టపా "సంసారి కాని వాడికి,సన్యాసి అయ్యే అర్హత లేదు." లో ఈ విషయం కూడా ప్రస్తావించడం జరిగినది. . ఉదాహరణకు స్త్రీల పట్ల పురుషులు ప్రవర్తించవలసిన తీరు గురించి మొదట్లో శ్లోకాలు ఎంతో ఉద్దాత్తంగా ఉన్నాయి . స్త్రీలను గౌరవించని , పూజించని కులం లేక జాతి సర్వనాశనం అవుతుందని చెప్పిన మనువు మహాశయుడు ఆ తర్వాతి శ్లోకాలలో స్త్రీలను దారుణంగా అణచివేసి తమ ఆదిపత్యంలో ఉంచుకుని వారికి స్వాతంత్ర్యం లేకుండా చేయాలని చెప్పడం విడ్డూరమే