గ్రంధాలు పట్టుకు తిరిగేవారు జ్ఞానులూ, ఆవు చుట్టూ తిరిగే వారు అజ్ఞానులా ?!!
హిందూ జీవన విధానంలో భగవంతుని దర్శించి తద్వారా జీవన్ముక్తులు అయ్యే పద్ధతుల్లో ముక్యంగా 3 మార్గాలు ఉన్నాయి . (1). జ్ఞాన మార్గం (2) భక్తి మార్గం.3 కర్మమార్గం . సాంప్రదాయిక జ్ఞానమార్గంలో ఉన్నవారు ఎవరైనా ఒక గురువును ఆశ్రయించి , వేదోపనిషత్తుల ఇతర గ్రంధాలలోని సారాంశం తెలుసుకోవడం ,ఆ గురువుగారు చెప్పిన విధానంలోనే భగవంతుణ్ణి దర్శించడం చేస్తుంటారు. వీరి దృష్టిలో దేవుడు వేరు . గురువు వేరు. దేవుడు గురించి తెలుసుకోవాలంటే గురుబోధలు ద్వారానే అది సాధ్యమవుతుoది తప్పా అన్యదా కాదు అనేది జ్ఞాన మార్గీయుల అభిప్రాయం లేక విశ్వాసం . ఇక భక్తి మార్గం లో భగవత్ దర్శనం చేసుకునే వారికి ఏ గ్రంధాలు లేక గురువులు తోనూ పని లేదు . వారికి అలౌకిక అనందం ఇచ్చేది ఏదైనా సరే దానిని భగవంతుణ్ణి గానే భావిస్తారు . నిత్యం తాము దేవుడు అని నమ్మడానికి వీరికి ఏ గ్రంద సారాంశం అక్కర...