Posts

స్వామీ పరిపూర్ణానంద ప్రతిపాదిత "హిందూ ధార్మిక కౌన్సిల్ " కు కేవలం ప్రశ్నించే హక్కు ఇచ్చినంత మాత్రానా దేవాలయ వ్యవస్థ బాగుపడి పోతుందా ?

Image
                                 మన తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం కి సంబంధించినంత వరకు పీఠాధిపతులకి , స్వామీజీలకు, బాబాలకు కొదువేమి లేదు . కానీ ఉమ్మడి రాష్ట్రాల్లోని దేవాలయాలు సుమారు 33,000 పై చిలుకు ఉన్నప్పటికీ అందులో 31,000 దేవాలయాలు లోని దేవుళ్ళు దూపదీప నైవేద్యాలు లేక అనాధలుగా మిగిలిపోతే ,దానికి తరుణోపాయం చెప్పే వారు లేరు. ఒక పక్క పాత దేవాలయాలలో దేవుళ్ళకే దిక్కులేకపోతే,మరొక పక్క లక్షలు, కోట్లు వెచ్చించి కొత్త దేవాలయాలను అదే ఊళ్లలో నిర్మిస్తుంటే ,ఇదెంతవరకు సమంజసం ?అని అడిగిన నాధుడు లేదు.                                                      హిందూ ధర్మం ప్రకారం "దేవాలయ నిర్మాణం " అనేది సప్త సంతానం లో ఒకటి. అంటే దేవాలయాలు నిర్మించే వారు వ్యక్తులు కానీ, గ్రామాలు కానీ ,ఆ దేవాలయ నిర్వహణకు అయ్యే ఖర్చు స్వయంగా దగ్గరుండి చూచుకోవడమో , లేక అందుకు అయ్యే వ్యయం భరించగలిగే విధంగా తగిన ఆస్తులు అవి సమకూర్చగలిగితేనే దేవాలయ నిర్మాణం చేపట్టాలి  . అలా కాకుండా ఊళ్ళో ఉన్న పాత దేవాలయాలు ఆలనా పాలనా పట్టించుకోకుండా , ఎవరో దాతలు డబ్బులు ఇచ్చారని ఊరంతా చందాలు వేసుకుని , పది రోజులు సంబురాలు చే

కోడలు కాఫీ కలిపితే "అమృతం " అనుకున్నారు కాని , అందులో "కోడలామృతం " కలిపి ఇస్తుందని తెలుసుకోలేక పోయిన అభాగ్య అత్తా మామలు!

Image
                                                                                   ఇంటికి కోడలిని తెచ్చుకోవాలనుకునే అబ్బాయి తల్లితండ్రులు , సదరు కోడలి బ్యాక్ గ్రౌండ్ గురించి అటు ఏడుతరాలు , ఇటు ఏడు తరాల చరిత్ర చూడాలి అనే వారు మన పెద్దలు. ఏడుతరాలు కాదు కదా , కనీసం ఏడు రోజుల చరిత్ర కూడా చూసే అంత ఓపిక ,టైం లెకుండా పోతున్నాయి ఈ  నాటి పెళ్లి పెద్దలకు ,  బాగా డబ్బు,బంగారం  ఇచ్చే  కోడళ్ళు ను తెచ్చేసుకోవటానికి తెగ ఆరాట పడి పోతుంటారు . కోడలి  గుణం మంచి ది కాకపోతే తాము బవిష్యత్లో ఎన్ని బాదలు పడాలో , మద్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఈ అత్తా మామల వ్యధా పూరిత కద వింటె తెలుస్తుంది . వారు అమాయకంగా తమ కోడలి "మూత్రం " సంవత్సర కాలం పాటు తాగారు అంటె , అది దేవుడు విదించిన శిక్ష కాదు. వారి   బరి తెగించిన కోడలు  వారి మీద తీర్చుకున్న కసి . దాని గురించి పూర్తిగా తెలియాలంటే క్రింద ఇచ్చిన వివరాలు చూడాల్సిందే !                ఇండోర్ కు దీపక్ నాగవంశి, రేఖా నాగవంశి భార్య భర్తలు . వారికి నాలుగేళ్ల పాప ఉంది . రేఖ కు తన  అత్తమామలు   తో కలసి ఉండడం   అంటె అస్సలు  గిట్టేది కాదు . అందుకే తన పుట్ట

కారు నడుపుతూ "పేస్ బుక్ " గురించి ఆలోచించినందుకు "పేస్ "అంతా పచ్చడి అయిoదట !

Image
                                                                                                                              "పిచ్చి ,పిచ్చి, పిచ్చి రక రకాల పిచ్చి ! ఏ పిచ్చి లేదనుకుంటే అది అసలైన పిచ్చి !" . ఇది ఏ సినిమాలో పాటో గుర్తు లేదు కాని , పాడింది మాత్రం భానుమతి గారు అని మాత్రం గుర్తు!. ఇది అసలు సిసలైన జీవన సత్యమ్. ఒకరి కి ఉన్న పిచ్చి గురించి మరొకరికి సదభిప్రాయం ఉండదు కాని , ప్రతి వారిలోనూ ఏదో రకం పిచ్చి ఉండే ఉంటుంది . ఇందులో సదరు పిచ్చి వలన వ్యక్తికీ గాని , కుటుంబానికి గాని , సమాజానికి కాని లాభం ఉంటె అది ఒక గొప్ప ప్రవర్తన గా గుర్తించబడుతుంది . లేకుంటే అది పిచ్చిగానే మిగిలి పోతుంది . ఉదాహరణకు డబ్బు సంపాదన పిచ్చి వలన లాభం ఉంటుంది కాబట్టి , అవినీతితో డబ్బు సంపాదించినా అది గ్రేటే .  సమాజానికి మేలు చేసే రచనలు , కవితలు రాసే వారు ఎంత గొప్పగా ఆలోచనలు కలిగి ఉన్నా , వారి రచనలుకు పైసా ఆదాయం రానప్పుడు వారివి పిచ్చి రాతలే అవుతాయి . సో ఇందులో ఆర్దిక ఉపయోగిత వాదం ఇమిడి ఉంది .                                            సరే  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే , ఈ  మద్య సం

కొడుకు వయసు ఉన్న కుర్రాడితో 'లవ్ గేమ్ " ఆడినందుకు 'కుక్క చావు ' చచ్చిన పేస్ బుక్ ప్రేమికురాలు ! .

Image
                                                                                                         వెర్రీ వేయి విదాలు అంటారు . అందులో ప్రేమ వెర్రి ఒకటి . ఉచ్చ నీచాలు , వావి వరుసలు, వయసు తారతమ్యాలు ఇత్యాది వి అన్ని మరచి పోయి , మోస పూరిత విదానాలతో ఒక కుర్రాన్ని రెండు న్నర్ర సంవత్సరాల పాటు ప్రేమ పేరుతొ వెరెత్తిoచిన ముగ్గురు పిల్లల్లున్న తల్లి  చివరకు అ కుర్రాడి చేతిలోనే దారుణంగా హత్య చేయబడింది . వివరాలు లోకి వెళితే ,                        చిన్న వాళ్ళు , పెద్ద వాళ్ళు  అనే బేద బావం లేకుండా , అందరి మనో వికారాలను సంతృప్తి పరస్తుంది , సామాజిక సైట్ "పేస్ బుక్" . అందులో ఎవరైనా సరే తమ గురించి అబ్బద్దపు సమాచారంతో ఖాతా ఓపెన్ చేసి , తమ మనసులో ఉన్న వికారాలు అన్ని ప్రదర్సించ వచ్చు. అది నిజమే అని నమ్మి కొంత మంది బకరాలు అయి చివరకు బలి పశువులు అయిన ఉదంతాలు ఎన్నో !. అదిగో అలాoటి ప్రేమ వికారం పుష్కలంగా ఉన్న స్త్రీయే జబల్ పూర్ కి చెందిన 45 సంవత్సరాల జ్యోతి కరోనా . ఆమె కు 21 సంవత్సరాల వయసు గల కూతురుతో సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు . భర్త ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లో క్లర్క్ గా పని చ

సహచరుల అంగాలు అమ్ముకుని బ్రతికే రాక్షసులకు , శాంతి వచనాలు రుచిస్తాయా గురూజీ !!?

Image
                                                                                                   ఈ  మద్య మన హైదరాబాద్ నుంచి కొంత మంది ముస్లిం యువకులు , అంతర్జాతియ ఉగ్రవాద  సంస్త అయిన ISIS పట్ల ఆకర్షితులై అందులో చేరి తమ మతాభిమానం చాటుకోవడానికి ఏగేసుకు పోతున్నారట. అటువంటి వారికి ఒక శుభ వార్త! ప్రస్తుతం ISIS ఉగ్రసంస్త నిదుల లేమితో కష్టాల్లో ఉందట! పాపం అందుకనే  తమ సహచరులు ఎవరైనా పోరాటం లో గాయపడితే , వారు బ్రతికి ఉండగానే వారి శరీర అంగాలు తొలగించి వాటిని అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుని తద్వారా వచ్చే డబ్బుతో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారట. కాబట్టి ఎవరైనా ఒత్సాహికులు బ్రతికి ఉండగానే తమ అంగాలను కోయించుకోవాలని ఉబలాటపడుతుంటే నిరబ్యంతరంగా ఆ సంస్తలో జాయిన్ కావచ్చు!.    పూర్వకాలం లో రాక్ష జాతి ఒకటి ఉండెది అని మన పురాణాలు చెపుతుంటే , అవి పుక్కిటి పురాణాలు అని ఎద్దేవా చేసే వారు ఉన్నారు. అటువంటి వారికి ఆ రాక్షస జాతి వారసులు " మేమున్నాం ,ఇది నిజం" అని తమ చేష్టల ద్వారా రుజువు చేస్తున్న ISIS సంస్త సబ్యులను చూసి తెల్లముఖాలు వేయాల్సిందే! యుద్దాలలో పట్టుబడిన స్త్రీలను  సెక్స్

కొడుకింట్లో ముందు గది,కూతురింట్లో వంట గది!

Image
 ఈ మద్య తల్లి తండ్రుల ద్రుక్పదంలో మగపిల్లల విషయంలో కొంత మార్పు వస్తున్నట్టుంది.ఇదివరలో ఆడ పిల్ల "అక్కడి పిల్ల" అనే భావంతో ఉండేవారు. ఆడపిల్లని పెద్ద చదువులు చదివిస్తే,అంతకంటే ఎక్కువ చదివిన వరుణ్ణి తేవాలంటే, కట్నాలు ఎక్కవ ఇవ్వడమే కాక దొరకడం కూడ కష్టమయి పోతుందనే బావంతో, మగపిల్లల్ని చదివించినంతగా ఆడ పిల్లల్ని చదివించేవారు కాదు. మగపిల్లాడు అంటే తమను ముసలితనంలో ఆదుకోవల్సిన వాడు అనే బావంతో కూడ మగపిల్లలకే ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చే వారు.  కాని రోజులు మారాయి. ఆడపిల్లల్ని ఇచ్చే దగ్గర తమ పిల్లకు సాద్యమయినంత వరకు అత్త పోరు, ఆడబిడ్డల పోరు లేని కుటుంబమయితే బాగుండు అని ఆలోచిస్తున్నారు.ఉమ్మడి కుటుంబాలు అనేవి తగ్గిపోయాయి. మగపిల్లలు ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలలో ఉండాల్సిరావడం,నేటి యువత ఎక్కువ స్వేచ్చ దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో, పెళ్లయిన వెంటనే వేరు కాపురాలు పెట్టేస్తున్నారు.దీనికోసం కుటుంబాలలోని,చిన్న చిన్న తగాదాలను బూతద్దాలలో చూపిస్తూ,మొగుళ్లని వేరు కాపురం కోసం వత్తిడి చెయ్యడం పరిపాటి అయిపోయింది.   అలా వేరు కాపురాల వల్ల కొంచం ఆదపిల్లల్కి స్వేచ్చ లబించడం వల్ల తమ పుట్టింటి వారితో ఎక్కువ కాంట

"పెట్టు -పట్టు -కొట్టు " అనే ఫేస్ బుక్ వ్యాపారం లో లక్షలు సంపాదించిన వరంగల్ మాయలేడి !!?

Image
                                                                                                                 మోసాలు చేసి పెండ్లిళ్ళు చేసుకోవడం కొంతమంది మగవాళ్ళ పేటెంట్ రైట్ ఏమీ కాదు. అవకాశం చిక్కితే అతివలు అంతకంటె ఘనులే అని నిరూపించే ఎన్నో ఉదంతాలు ప్రస్తుత సమాజం లో కంటున్నాం . వింటున్నాం. అలాంటి మాయలేడి కోవలోకే వస్తుంది వరంగల్ కి చెందిన ఈ మాయలేడి కేసు. కాకపోతే ఇలాంటి మాయలాడి వలలో పడే మగవాళ్ళు ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి పూర్తి విచారణ చేయకుండా ఎలా  ఆమె ఉచ్చులో చిక్కుకున్నారో అర్దం కావటం లేదు. వివరాలులోకి వెలితే ,    వరంగల్ కి చెందిన ఆమె బ్రతకడానికి ఏ వ్యాపారం అయితే బెస్ట్ అని ఆలోచించగా , ఆలోచించగా ఆమెకొక బ్రహ్మాండ మైన ఆలోచన వచ్చిందంట. ఇంతవరకు ఆడపిల్లలను పెండ్లిళ్ళ పేరుతో మోసం చేస్తూ  సమాజం లో దర్జాగా బ్రతుకుతున్న కొంత మంది నిత్యపెండ్లి కొడుకులు ఆమెకు స్పూర్తిగా నిలిచారు. మోసపు పెండ్లిళ్ళు చేసుకోవడం లో మగాళ్ళు పేటెంట్ రైట్ కలిగిఉండం ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు. అన్ని రంగాల్లో పురుషులతో పాటు స్త్రీలు సమానమే అని రుజువు చేసుకుంటున్న  ఆధునిక సమాజం  లో "మోసపు  పెండ్లిళ్ళు&qu