కారు నడుపుతూ "పేస్ బుక్ " గురించి ఆలోచించినందుకు "పేస్ "అంతా పచ్చడి అయిoదట !
"పిచ్చి ,పిచ్చి, పిచ్చి రక రకాల పిచ్చి ! ఏ పిచ్చి లేదనుకుంటే అది అసలైన పిచ్చి !" . ఇది ఏ సినిమాలో పాటో గుర్తు లేదు కాని , పాడింది మాత్రం భానుమతి గారు అని మాత్రం గుర్తు!. ఇది అసలు సిసలైన జీవన సత్యమ్. ఒకరి కి ఉన్న పిచ్చి గురించి మరొకరికి సదభిప్రాయం ఉండదు కాని , ప్రతి వారిలోనూ ఏదో రకం పిచ్చి ఉండే ఉంటుంది . ఇందులో సదరు పిచ్చి వలన వ్యక్తికీ గాని , కుటుంబానికి గాని , సమాజానికి కాని లాభం ఉంటె అది ఒక గొప్ప ప్రవర్తన గా గుర్తించబడుతుంది . లేకుంటే అది పిచ్చిగానే మిగిలి పోతుంది . ఉదాహరణకు డబ్బు సంపాదన పిచ్చి వలన లాభం ఉంటుంది కాబట్టి , అవినీతితో డబ్బు స...