దేవుడికి దగ్గరవుతారని చెప్పి,400 మంది శిష్యుల వ్రుషణాలను కోయించి వేసిన "వృషభ గురువు"!!!
అతడొక గురువు. కాని అందరికి మల్లె అట్టాంటి ఇట్టాంటి మామూలు గురువు కాదు .ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ ల మంది అనుచరులు ఉన్న "చార్మిషింగ్ గురు". అతడే "డేరా సచ్చా సౌదా "అనే మత సంస్త వ్యవస్తాపకుడు " గుర్మీత్ రాం రహీం సింగ్ ". ఇతడు సిక్కు మతానికి వ్యతిరేకంగా అందరూ ఒకటే అనే కాన్సెప్ట్ తో మూడు మతాలకు సంబందించిన పేరుతో ఉద్బవించిన ఒక సంచలన గురువు . పాలోయ ర్స్ సంఖ్యను ను బట్టి , గురువుల గొప్ప తన్నాన్ని నిర్ణయించాల్సి ఉంటే మాత్రం ఇతడు గొప్ప గురువే .కాని గురు భోదలు అనుసారం "గురు " పరిక్ష జరిపితే మాత్రం ఇతడు ఒక తిక్కల గురువు లేదా మానసిక సమస్యతో బాదపడుతున్న గురువు అని అనక తప్పదు .దానికి కారణం 2000 వ సంవత్సరం లో అతడు చేసిన ఒక "మహా పాప కార్యం ". అదేమిటో చూదాం . గుర్మిత్ రామ్ రహీం సింగ్ చేసే బోదలలో ప్రదానమైనది "దేవుడికి దగ్గర కావటం ఎలా "? .దీని కోసం అతడు సూచించిన మార్గం పురుషులు తమ వ్రుషణాలను ఆపరేషన్ ద్వారా తొలగించుకోవాలి