Posts

Showing posts from May, 2017

స్వామీ పరిపూర్ణానంద ప్రతిపాదిత "హిందూ ధార్మిక కౌన్సిల్ " కు కేవలం ప్రశ్నించే హక్కు ఇచ్చినంత మాత్రానా దేవాలయ వ్యవస్థ బాగుపడి పోతుందా ?

Image
                                 మన తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం కి సంబంధించినంత వరకు పీఠాధిపతులకి , స్వామీజీలకు, బాబాలకు కొదువేమి లేదు . కానీ ఉమ్మడి రాష్ట్రాల్లోని దేవాలయాలు సుమారు 33,000 పై చిలుకు ఉన్నప్పటికీ అందులో 31,000 దేవాలయాలు లోని దేవుళ్ళు దూపదీప నైవేద్యాలు లేక అనాధలుగా మిగిలిపోతే ,దానికి తరుణోపాయం చెప్పే వారు లేరు. ఒక పక్క పాత దేవాలయాలలో దేవుళ్ళకే దిక్కులేకపోతే,మరొక పక్క లక్షలు, కోట్లు వెచ్చించి కొత్త దేవాలయాలను అదే ఊళ్లలో నిర్మిస్తుంటే ,ఇదెంతవరకు సమంజసం ?అని అడిగిన నాధుడు లేదు.                                                      హిందూ ధర్మం ప్రకారం "దేవాలయ నిర్మాణం " అనేది సప్త సంతానం లో ఒకటి. అంటే దేవాలయాలు నిర్మించే వారు వ్యక్తులు కానీ, గ్రామాలు కానీ ,ఆ దేవాలయ నిర్వహణకు అయ్యే ఖర్చు స్వయంగా దగ్గరుండి చూచుకోవడమో , లేక అందుకు అయ్యే వ్యయం భరించగలిగే విధంగా తగిన ఆస్తులు అవి సమకూర్చగలిగితేనే దేవాలయ నిర్మాణం చేపట్టాలి  . అలా కాకుండా ఊళ్ళో ఉన్న పాత దేవాలయాలు ఆలనా పాలనా పట్టించుకోకుండా , ఎవరో దాతలు డబ్బులు ఇచ్చారని ఊరంతా చందాలు వేసుకుని , పది రోజులు సంబురాలు చే

కోడలు కాఫీ కలిపితే "అమృతం " అనుకున్నారు కాని , అందులో "కోడలామృతం " కలిపి ఇస్తుందని తెలుసుకోలేక పోయిన అభాగ్య అత్తా మామలు!

Image
                                                                                   ఇంటికి కోడలిని తెచ్చుకోవాలనుకునే అబ్బాయి తల్లితండ్రులు , సదరు కోడలి బ్యాక్ గ్రౌండ్ గురించి అటు ఏడుతరాలు , ఇటు ఏడు తరాల చరిత్ర చూడాలి అనే వారు మన పెద్దలు. ఏడుతరాలు కాదు కదా , కనీసం ఏడు రోజుల చరిత్ర కూడా చూసే అంత ఓపిక ,టైం లెకుండా పోతున్నాయి ఈ  నాటి పెళ్లి పెద్దలకు ,  బాగా డబ్బు,బంగారం  ఇచ్చే  కోడళ్ళు ను తెచ్చేసుకోవటానికి తెగ ఆరాట పడి పోతుంటారు . కోడలి  గుణం మంచి ది కాకపోతే తాము బవిష్యత్లో ఎన్ని బాదలు పడాలో , మద్య ప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఈ అత్తా మామల వ్యధా పూరిత కద వింటె తెలుస్తుంది . వారు అమాయకంగా తమ కోడలి "మూత్రం " సంవత్సర కాలం పాటు తాగారు అంటె , అది దేవుడు విదించిన శిక్ష కాదు. వారి   బరి తెగించిన కోడలు  వారి మీద తీర్చుకున్న కసి . దాని గురించి పూర్తిగా తెలియాలంటే క్రింద ఇచ్చిన వివరాలు చూడాల్సిందే !                ఇండోర్ కు దీపక్ నాగవంశి, రేఖా నాగవంశి భార్య భర్తలు . వారికి నాలుగేళ్ల పాప ఉంది . రేఖ కు తన  అత్తమామలు   తో కలసి ఉండడం   అంటె అస్సలు  గిట్టేది కాదు . అందుకే తన పుట్ట