ఈ అమ్మాయి వ్యదని సాక్షీ పేపర్ వారే నమ్మటం లేదంటే అలోచించాల్సిందే మరి !
పాపం ఎవరో ఒక అమ్మాయి ! ఊరు, పేరు చెప్పటం లేదు . ఈమే చెప్పే విషయం వింటుంటే యువతకు ఆమె తల్లి తండ్రుల మీద చెప్పరానంత వస్తుంటే ,అనుభవం ఉన్న పెద్దొళ్ళకు మాత్రం కొంచం అనుమానం కలుగుతుంది . మొత్తానికి టూకీగా విషయం ఏమిటంటె ఊరూ పేరు చెప్పకుండా ఒక అమ్మాయి పేస్ బుక్ లో ప్రత్యక్షమై , కన్నీటితో తన తండ్రిని ఇలా ప్రస్నిస్తుంది ""నాన్నా.. ఈ ప్రపంచంలో నేను అత్యంతగా ప్రేమించేది మిమ్మల్నే. మీరేది చేసినా నా మంచికే అనుకుని, మీ మాటకే కట్టుబడి ఉన్నా. నాకు పెళ్లి సంబంధం తెచ్చినప్పుడు, 'నాకు అతను నచ్చలేదు నాన్నా..' అని చెప్పినా వినిపించుకోకుండా అతనికే ఇచ్చి చేశారు! అతను నన్ను చిత్ర హింసలు పెడుతున్నా చూస్తూ ఊరుకున్నారే గానీ, అతన్ని ఒక్క మాట అనలేదు. ఎందుకు నాన్నా ఇలా చేస్తున్నారు ? నాకంటే అతనే ఎక్కువయ్యాడా ?" అ...