Posts

Showing posts from September, 2014

తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ "బతుకమ్మ " ఆడుతుందా?

తెలంగాణా లోని మెజార్టీ  స్త్రీలు ఎంతో వైబవంగా ,సాంప్రదాయ బద్దoగా, ఆడంబరాలకు ,బెషజాలకు అతీతంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ . ఇది ప్రత్యేకంగా  తెలంగాణా ప్రాంతానికే చెందినది కావడం వలన తెలంగాణా సర్కార్ ఈ పండుగ దినాలను  "సర్కార్ పండుగ " గా  ప్రకటించడం నూటికి నూరు పాళ్ళు సమర్దనియం . ఈ సందర్బంగా తెలంగాణా రాష్ట్ర ముక్యమంత్రి గారు "బతుకమ్మ పండుగ ఏ కులానికో మతానికో సంబందించిది కాదు , ఇది యావత్ తెలంగాణా ప్రజల పండగ . అందుకే దీనిని స్టేట్ పెస్టివల్ గా డిక్లెర్ చేస్తున్నాం ". అని చెప్పడం మహదానందం కలిగించే మాట. దీనికి యావత్ తెలంగాణా ప్రజలు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాం .

    అయితే నాకొక చిన్న అనుమానం ఉంది . మరి ఇంత గొప్ప పండుగ అయిన మన సంప్రాదాయ  "బతుకమ్మ " పాటలను మన రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గారు అయిన "సానియా మిర్జా " గారు పాడుతూ అడగలరా ? మన బతుకమ్మ పండుగ విశిష్టతను విదేశాల వారికి అర్ధమయ్యేలా వివరించగలరా ? ఎంతో మంది భారతీయ మహిళా మణులు పాల్గొంటున్న మన స్టేట్ పెస్ట్వల్ లో అసలు సానియా మిర్జా గారు పాల్గొంటారా ? లేదా ? …

చీర లోని గొప్పతనం సంగతేమో కాని , ఉపయోగాన్ని మాత్రం కనుకున్న మధ్యప్రదేశ్ మగ M.L.A

Image
కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నా , వాటి గురించి వింటున్న భారత దేశం లో ప్రజా ప్రతినిధులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అని అశ్చ్యర్యం తో పాటూ అసహ్యం వేస్తుంది. మద్య ప్రదేస్ లో జరిగిన సంఘటన ఇది . ఒక కార్యక్రమo లో మాజీ మహిళా M.P ఒకరు మరియు ప్రస్తుత మగ M.L.A  పాల్గోన్నారట .  జ్యోతి ప్రజ్వలనం తర్వాత తన చేతికి అంటిన నూనెను తుడుచుకోవటానికి నాప్ కిన్ దొరకక సదరు మహిళా మాజీ M.P గారి చీరకు తుడుచుకున్నాడు అ మగ M.L.A . దీనిని ఆ M.P గారు గమనించలేదు కాని విడియో కెమెరాలు మాత్రం కనిపెట్టాయి . దీనికి అ ప్రబుద్దుడు ఏమని సంజాయిషీ ఇచ్చాడో క్రింది వీడియోను చూసి తెలుసుకోండి .



   పై సంఘటన చూసాక స్త్రీలు ధరించే "చీర " గురించి దాని గొప్ప తనం గురించి ఒక సినిమా కవి ఏమన్నాడో గుర్తుకు వచ్చింది .  కాని ఆ మధ్యప్రదేశ్ మగ M.L.A    కి స్త్రీలను మాత్రమె కాదు వారు కట్టుకున్న చీరలు కూడా ఎలా ఉపయోగించవచ్చో బాగా తెలుసు కాబట్టే ఇలా పబ్లిక్ గా ఫాల్తూ పని చేసాడు అనిపించింది . సినిమా కవి చెప్పిన చిర గొప్పతనం ఏమిటో క్రింది విడియోలో చూడండి .

వైజాగ్ లో పార్కులకు వెళ్లేవారికి "బ్లూ పిలిమ్స్ " ప్రదర్సనలు "ప్రీ " అంట!

ఈ నాటి యువత లో కొంత మంది ప్రవర్తిస్తున్న తిరు చూస్తుంటే వారికే మాత్రం సామాజిక బాద్యత లు గురించి పట్టింపు లేనట్లు కనిపిస్తుంది . సాదారణం గా నగరాల్లో నివసించే మద్య తరగతి ప్రజలకు సేద దీర్చే కేంద్రాలు పార్కులు . తమ పిల్లలతో కొంత సేపు సాయం వేళలో పార్కుల్లో గడుపుదామని వచ్చె తల్లి తండ్రులకు అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూసి "చీ ఛీ" ఇలాంటి ప్రాంతానికి వచ్చామేమిటిరా అని బాద పడాల్సి వస్తుందట! కారణం , సిగ్గూ శరం లేని కొంత మంది  యువకులు ప్రేమ పేరుతో అక్కడ సాగిస్తున్న "ప్రణయ కాండ" . అది చూసిన తమ పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేక పెద్దలు తెగ  ఇబ్బంది పడిపోతున్నారట !

                        ఇదే విషయం గురించి వైజాగ్ పార్కుల్లో జరుగుతున్నా బూతు తంతు మీద T.V 9 వారు ఒక కార్యక్రమం ప్రసారం చేసారు . క్రింది విడియోను క్లిక్ చేసి చూడగలరు . వైజాగ్ కార్పోరేషన్ వారు స్పందించి తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది .లేదూ,   ఒక వేళ అటువంటి ప్రేమికులు  పార్కులను వారి ప్రేమ కలాపాలకు వినియోగించుకునే హక్కు ఉందని బావిస్తే ,వారికి విడిగా  "శ్రుంగార వనాలు " ను ఏర్పాటు చేసి కొంత పీజు వ…

సీమాంద్రా రాజదానిని రెండు నరసింహ క్షేత్రాలైన అగిరి పల్లి, మంగళ గిరి మద్య నిర్మింఛి "నర సింగపూర్" అని పేరు పెడితే బాగుంటుంది !

Image
సీమాంద్ర నూతన రాజదాని ని విజయవాడ చుట్టు ప్రక్కల ప్రాంతంలోనే నిర్మిస్తామని ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారు ప్రకటించడం   దైవ సంకల్పం లో బాగంగానే  అనిపిస్తుంది . మొన్నటి దాక వివిధ ప్రాంతాలు పేర్లు చెప్పుకోచ్సినప్పటికి రాజదానిగా ముక్యంగా గుంటూర్ , తెనాలి, మంగళగిరి , విజయవాడ మద్య ప్రాంతమే  బహుళ ప్రచారం లో ఉండటం వలన ఆ ప్రాంతాలులోని బూములకు బూమ్ వచ్చింది . అయితే అనూహ్యంగా తేరా మీదకు అగిరిపల్లి పరిసర ప్రాంతాలు రాజదానిగా చేయనున్నారని వార్తలు రావడం , ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు విజయవాడ పరిసరాలలోనే రాజదాని ఉంటుందని ప్రకటించడం తో "అగిరి పల్లి" పరిసర అటవీ ప్రాంతానికి మహర్దశ  పట్టినట్లే .


  అగిరి పల్లి ఒక పుణ్య క్షేత్రమ్ . దేవదేవుడైన ఆ నరసింహ స్వామీ ఇక్కడ శోభనాచల వ్యాఘ్రా లక్ష్మీ నరసింహ స్వామిగా శోభానా చలం పై వేంచేసి ఉన్నారు . ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకోవాలంటే  క్రింది వీడియోను చూడవచ్చు .అగిరిపల్లి చుట్టూ అటవి ప్రాంతం వేల ఎకరాల్లో విస్తరించి ఉండటం వలన ఇక్కడ రాజదాని నిర్మాణం వ్యయ భరితం కాదని సర్కార్ వారి ఆలోచన . అగిరిపల్లి, అడవినెక్కలం , నున్న, గడ్డ మణుగు గ్రామ ప్రాంత ఫరిసరాలలో సుమ…