మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయి , మృగాడు ముద్దుపెట్టుకుంటుంటే ఏమి చేయలేక పోయింది ఎందుకని ?!!





                                   మొన్న 1 వ తేదీన అర్ధరాత్రి , బెంగళూరు లోని రెసిడెన్షియల్ ఏరియా అయినా కమ్మనహళ్లి లో జరిగిన ఒక సంఘటన, మీడియాల ప్రసారాలు వలన  భారతదేశం లో సెన్సేషనల్ విషయం గా మారింది. సదరు మీడియా వాళ్ళు చెప్పేది ఏమిటంటే , ఒక అమ్మాయి అర్ధరాత్రి 2 ఇంటికి తన ఇంటికి దగ్గరగా ఉన్న సందులో ఆటో దిగి , ఇంటికి వెడుతుంటే ఇద్దరు వ్యక్తులు ద్వి చక్రవాహనం మీద ఆ సందులోకి వచ్చి, ఆమెను పట్టుకుని ముద్దు పెట్టుకోవడమే కాక, బలవంతంగా టూ వీలర్ మీదకు ఎక్కించబోతే , ఆమె ప్రతిఘటించడం తో అది సాధ్యపడక ఆమెను అమానుషంగా రోడ్డు మీదకు త్రోసివేసి వెళ్లి పోయారు . అది జరిగిన విషయం.

    అయితే ఈ సంఘటనకు ముందు ఏమి జరిగిందో , ఆ  తర్వాత ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు . ఎందుకంటే అవి ఏవి  c.c  కెమెరాలలో రికార్డు కాకపోవడం ఒక కారణమైతే , సదరు బాధితురాలు పోలీస్ వారికి సమాచారం ఇవ్వకపోవడం రెండవ కారణం . తనకున్న పర్సనల్   కారణాలు వలన కావచ్చు ఆమె ఏ పిర్యాదు చేయనప్పటికీ , సమాజ హితo  సదా కోరుకునే మీడియా వారికి , CC  ఫుటేజ్ ల విషయం తెలిసే సరికి , దాని మీద కూపీ లాగి , చివరకు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని , విషయం రాబట్టారు . ఆంధ్ర జ్యోతి  ఆన్లైన్ పత్రిక లో ది  5/1/2017 న అంటే సంఘటన జరిగిన నాలుగు రోజులకు ప్రచురితమైన, బాధితురాలిగా చెప్పబడుతున్న  ఆమె ఇంటర్యూ సారాంశం ఏమిటంటే :-


                       ""నూతన సంవత్సరాన్ని స్వాగతించే  వేళ ఇద్దరు దుర్మార్గుల చేతిలో హింసకు గురైన యువతి తన మనోభావాలను వెల్లడించారు. ఆమె క్రైస్ట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. స్త్రీ, పురుష సమానత్వం రావాలంటే అతివాద ధోరణిని అనుసరించడం మాత్రమే ఏకైక మార్గమన్నారు. తాను చిన్నప్పటి నుంచి ఎదిగిన తీరును వివరించారు. విద్యా వ్యవస్థలో రావలసిన మార్పులను కూడా ప్రస్తావించారు. ఆమె ఏం చెప్పారో ఆమె మాటల్లోనే....

నేను బెంగళూరులో పుట్టాను. ఉదారవాదులైన నా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగాను. నాకు ఓ అన్నయ్య కూడా ఉన్నాడు. ఎనిమిదేళ్ళ వయసు నుంచీ నేను స్వతంత్రురాలినే. బాగా పొద్దు పోయే దాకా నగరంలోని రోడ్ల మీద ఆడుకునేదాన్ని. నేనొక్కదాన్నే డ్యాన్స్ క్లాసులకు వెళ్ళేదాన్ని. అయినా నాకు ఈ నగరం మీద ప్రేమతో పాటు భయాందోళనలు కూడా ఉన్నాయి.

యవ్వనంలో ఉన్నవాళ్ళు బెంగళూరులో మసలుకోవడంలో మధురానుభూతులేవీ ఉండవు. నేను నా ఫ్రెండ్‌తో కలిసి నగరంలో సంచరించేటపుడు వెంటపడి వేధించిన సంఘటనలు వందలాది ఉన్నాయి. దుర్మార్గుల నుంచి మెసేజ్‌లు, కాల్స్ లెక్కలేనన్ని వస్తూంటాయి. ఈలలు, కారుకూతలు కూడా అదే స్థాయిలో ఎదుర్కొన్నాను.

స్వేచ్ఛగా ఎదగడం నన్ను నేను కాపాడుకోవడాన్ని నేర్పింది. అందుకే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో చేరాను. స్థానిక భాషను కూడా నేర్చుకున్నాను. కానీ కష్టాల్లో ఉన్నపుడు ఇవేవీ ఉపయోగపడటం లేదు. నగరంలో ఉన్న మగాళ్ళు తమదే పై చేయి అని నమ్ముతారు. మహిళా డ్రైవర్లపై పురుషులు ఇదే భావంతో ఉంటారని ఇటీవలే ఓ సర్వేలో వెల్లడైంది.

నేను మా కాలేజీ సమీపంలో చిన్న ప్రమాదానికి గురయ్యాను. అప్పుడు చాలా మంది మగాళ్ళు వచ్చారు. నా చుట్టూ మూగి గుడ్లురిమి చూశారు. వాళ్ళు చూసిందేమీ లేకపోయినా ప్రమాదానికి కారణం నేనేనంటూ నన్నే నిందించారు.

ఎక్కువమంది మగాళ్ళు చుట్టూ చేరినపుడు బలమైన బాయ్‌ఫ్రెండ్‌ పక్కనే ఉన్నా ఏమీ చేయలేడని నాకు బాగా అర్థమైంది. మహిళకు పురుషుడి సాయం లేకపోతే ఆమెపై జాలి చూపించరు. పోలీసులు కూడా సాయం చేయరు. ఉద్యోగం మానుకోమని వాళ్ళు సలహా ఇచ్చారు.

ఇలాంటివన్నీ పట్ట పగలే జరుగుతుండటంతో రాత్రి వేళల్లో కనీసం ఇంటి బయటికెళ్ళాలంటే మహిళకు ఎంత ధైర్యసాహసాలు అవసరమో ఊహించుకోవచ్చు. మన నగరంలోని మగాళ్ళు హింసాత్మకంగా మారుతున్నారు. మహిళలు ధైర్యంగా ఉండటాన్ని చూసిన మగాళ్ళు తమ శక్తిని వాళ్ళకు చూపించాలనుకుంటారు. ఇక్కడ సమానత్వం లేదు. ప్రభుత్వం, మన కుటుంబాలు, ప్రజలు మార్పును విశ్వసించాలి.

 దీనికి అడ్డుకట్ట వేయాలి. పురుషులు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. విద్యా బోధనలో స్త్రీ, పురుష సమానత్వాన్ని నొక్కి వక్కాణించాలి. సమానత్వాన్ని స్థాపించాలంటే రాడికల్ ఫెమినిజంతో ప్రారంభించాలని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాడికల్ ఫెమినిజం మాత్రమే ఏదైనా ప్రభావం చూపగలుగుతుంది.""

                                        సో , పై పత్రికా కధనం లో ఆమె చెప్పిన దాని ప్రకారం , ఆమెకు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది . కానీ వీడియోలో ఆమెను మృగాడు ఇబ్బంది పెడుతున్నప్పుడు  ఆ మార్షల్ విద్య తాలూకు రక్షణ టెక్నీకల్స్ ఏమి ప్రదర్శించలేదు సరికదా, ఆ మృగాడు ముద్దుపెట్టుకుంటుంటే 10 సెకన్లు బొమ్మలా నిలబడి పోయినట్లు కనపడుతుంది. వాడు బలవంతంగా బండి ఎక్కించబోయే ముందు కూడా సామాన్య ఆడపిల్ల లాగా పెనుగులాడింది తప్పా , మార్షల్ ఆర్ట్స్ తెలిసిన మగువ లాగా తెగువ చూపించలేక పోయింది . కనీసం మామూలు మనిషిలాగా పెద్ద పెద్ద కేకలు వేసి గోల చేసినా , రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి ఎవరైనా సహాయం చేయడానికి వచ్చేవారేమో !. కానీ అటువంటిదేమీ లేకుండా కామ్ గా ఇంటికి వెళ్లి పోయి ఏమి జరగనట్లే 3 రోజులు  ఊరుకుంది. మరి ఆ అమ్మాయే తనకు మార్షల్ ఆర్ట్స్ వలన తనను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకున్నాను అని చెపుతుంది. అసలు అసంఘటనకు సంబందించిన వీడియో  ఫుటేజ్ చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అవేమిటో తెలుసుకోవాలంటే ముందు వీడియోను చూదాం.

       








       పై వీడియోలో కనపడుతున్న దాని బట్టి , సంఘటన జరిగిన సందు మొదట్లో ఒక ఆటో ఆగి ఉంది . అందులోనుంచి మొదట ఒకావిడ దిగి నడుచుకుంటూ వెళ్లి పోయింది . ఆ తర్వాత కొంతసేపటికి  బాధితురాలు దిగింది. ఆమె కూడా నడుచుకుంటూ వస్తుంటే , ఒక ద్వి చక్ర వాహనం మీద ఇద్దరు మగాళ్లు ఆమెను క్రాస్ చేసి వెళ్లి , వెహికిల్ ని తిరిగి ఆమె వైపుకు పోనిచ్చారు. ఆ సమయానికి ఆమె దిగిన ఆటో అక్కడే ఉంది. మరో వెహికిల్ మీద వచ్చిన ఇద్దరు మగవాళ్ళు, ఇంకొంత మంది పాద చారులు బాధితురాలిని గమనిస్తూ ఉన్నట్లు కనపడుతుంది. ముందు వచ్చిన మృగాళ్ళలో ఒకడు బండి దిగి ఆ మాయని అడ్డగించడం చేయబోతే ఆమె తప్పించుకోవాలని చూసింది . అయినా ఆమెను పట్టుకుని ముద్దు పెట్టుకుంటుంటే కాసేపు నిలపడింది. ఆ తర్వాత వాడు ఆమెను బండివైపుకు లాక్కెళుతుంటే మాములుగా ప్రతిఘటించడం మొదలు పెట్టింది. ఇదంతా దూరంగా ఉన్న మగవాళ్ళు గమనిస్తున్న , వేడుక చూస్తున్నట్లు చూస్తున్నారు తప్పా ఎవరు ముందుకు వచ్చి ఆ అమ్మాయికి సహాయం చేసే ధోరణిలోఉన్నట్లు కనపడలేదు. చివరకు మృగాళ్లు ఆ అమ్మాయిని రోడ్డు మీదకు తోసివేశాక ,దూరంగా వేడుక చూస్తున్న వారు సినిమా అయిపోయినట్లు వెళ్లి పోవడం, దానితో మృగాళ్లు కూడా నిష్క్రమించడం జరిగినట్లు కనపడుతుంది.

      పై విషయం లో బాధితురాలి మార్షల్ ఆర్ట్స్ ప్రావిణ్యం ఆపత్కార సమయం లో ఎందుకు పనికి రాకుండా పోయిందని చెప్పవచ్చు.  పల్లెటూళ్ళో ఇలాంటి సంఘటన కనుక జరిగి ఉంటె మృగాళ్ల వీపులు ఎలా పగిలి ఉండేవో? కానీ జరిగింది ఆధునిక నాగరిక వెల్లివిరిసే బెంగళూర్ మహా నగరం లో కాబట్టి ,అర్ధరాత్రి అమ్మాయిని , నడి  బజార్లో మృగాళ్లు ముద్దు పెట్టుకుని , గుంజుకెళుతుంటే , సినిమా చూసినట్లు చూసారు తప్పా , ఒక్కడంటే ఒక్కడు ముందుకు రాలేదు. కాబట్టి దీనివలన అర్దమయ్యేది ఏమిటి? మార్షల్ ఆర్ట్స్ కానీ , మలినమైన నాగరిక లేక నగర సంస్కృతి  కానీ మగువలును  కాపాడలేవు అని.

   అడవుల్లో ఉండే గిరిజన  స్త్రీలు ఒంటరిగానే అడవుల్లో సంచరిస్తారు . కానీ వారికి ఏ గిరిజన మగాడు నుంచి లైంగికపరంగా ఆపద వాటిల్లుతుంది అన్న భయం వారికుండదు  . ఎందుకని? వారిలో ఉన్న "గుంపు సిద్ధాంతం " వారికి రక్షణ కవచం గా ఉంటుంది. వారు వ్యక్తిగత స్వేచ్ఛ అని కాకుండా కొన్ని కుటుంబాలు కలసి ఒక ప్రత్యేక  గుంపు గా  జీవనం కొనసాగిస్తూ ఉంటారు . ఒక గుంపు లో ఉన్న ఏ వ్యక్తి మీదైనా మరొక గుంపు వారు దాడి చేస్తే , అది యావత్ గుంపు మీద జరిగిన దాడిగా భావించి, బాధితుల గుంపు వ్యతిరేక గుంపు మీద ప్రతీకార  దాడి  చేస్తుంది. దానివలన ఒకరు చేసిన తప్పుకు గుంపు మొత్తం ప్రతిఫలం అనుభవించ వలసి వస్తుంది అనే భయం తో , ఎవరు వెదవ పనులు చేయడానికి సాహసించరు. ఇలా ఆడపిల్లల మీద అరాచకం జరుగుతుంటే "సినిమా" చూసినట్లు చూసి ఆనందం అనుభవించరు .

   కుటుంబం వద్దు, బంధాలు వద్దు ,వ్యక్తిగత స్వేచ్ఛ తో కూడిన  ప్రాశ్చాత్య "మై చాయిస్ " బ్రతుకే ముద్దు అనుకునే  నగర సంస్కృతీ స్త్రీలకు రక్షణ ఇస్తుందా లేక ఆడపిల్లల్ని కాపాడుకుంటూ , దారి తప్పే మగపిల్లని అదుపులో పెటుకోవాలనే సాంప్రదాయ కుటుంబ జీవనం ఆడపిల్లలకు రక్షణ ఇస్తుందా అనేది మేధావులు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన