కోడళ్లను కాల్చుకు తినే అత్తలకు,అత్తలను హింసించే కోడళ్ళకు బతుకమ్మ అడే నైతిక అర్హత ఉందా?


      
                                                                                            

                  రెండు తెలుగు రాష్ట్రాల లోని తెలుగు ప్రజలు గత 4 రోజులుగా స్త్రీ శక్తికి ప్రతి రూపం అయిన ఆ ఆదిశక్తిని ని తమ తమ సాంప్రాదాయ రీతులలో కొలిచి అంతులేని అలౌకిక అనందం ని అనుభవిస్తున్నారు  . తెలంగాణా ప్రాంతంలో ఆ తల్లిని "బతుకమ్మ " రూపంలో అట పాటలతో కొలిచినా , ఆంద్రా ప్రాంతంలో కనక దుర్గమ్మ రూపంలో ఆ తల్లిని వేడుకున్నా అంతరార్దమ్ ఒకటే . ఈ పది రోజులు ప్రక్రుతి రూపమైన స్త్రీ శక్తిని పూజించడమే . హిందూ జీవన విదానంలో పురుష శక్తి కి ఎంత ప్రాదాన్యం ఉందో స్త్రీ శక్తికి అంత ప్రాదాన్యం ఇవ్వబడింది అని దసరా పండుగ మరియు బతుకమ్మ పండుగల  విశిష్టత మనకు తెలియ చేసుంది .

   సాదారణంగా బతుకమ్మ ను తీరొక్క పువ్వుతో ఏర్పరచి స్త్రీలంతా తాము ఏర్పరచిన బతుకమ్మలను మద్యలో ఉంచి పాటలు పాడుతూ బతుకమ్మలు చుట్టూ నాట్యాలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటారు .ఈ  కార్యక్రమంలో పురుషుల పాత్ర ఏమిటంటే బతుకమ్మలు పేర్చడానికి కావలసిన పూలు సమకూర్చడమే . కానీ తెలంగాణా రాష్త్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను "రాష్త్ర పర్వం " గా ప్రకటించింది కాబట్టి , పురుష రాజకీయ నాయకులు కూడా స్త్రీలతో తో పాటు తాము బతుకమ్మల చుట్టూ ఆడి పాడి తమ భక్తిని చాటుకుంటున్నారు  . ఆ విదంగా మగాళ్ళతో కూడా బతుకమ్మ ఆడించిన ఘనత K.C.R  గారికి దక్కుతుంది . స్త్రీలను మ్రుగాళ్ళ నుంచి కాపాడడం లో రాజకీయ మగాళ్ళు సఫలం కాకున్నా , స్త్రీలతో పాటు తాము బతుకమ్మలు ఆడి "బతుకమ్మ"  పండుగలో స్త్రీల కున్న పేటెంట్ హక్కుల్లో తమకు బాగం ఉందని మాత్రం ప్రకటించగలిగారు  . చాలా సంతోషకరం .

                                                                         

 
                                    మన పండుగలు కేవలం బౌతిక అనందం కొరకో , మానసిక అనందం కొరకో జరుపుకునేవి మాత్రమే కాదు . ముఖ్యంగా దసరా దీపావళి పండుగలు . ఈ రెండు పండుగలు వెనుక ఉన్న పురాణ కదలను పరిశిలిస్తే దుష్ట శక్తులు మీద దైవ శక్తులు ముఖ్యంగా స్త్రీ దైవికశక్తులు సాదించిన విజయాలకు గుర్తుగా ఈ పండుగలు జర్పుకుంటున్నాం . అది మహిషాసుర మర్దనం కావచ్చు , నరకాసుర వద కావచ్చు . రెండింటిలోని విజేతలు "అమ్మ"లే . మరి అటువంటి స్త్రీ శక్తుల విజయాలను పండుగలు గా జరుపుకునే మన జాతీ కి స్త్రీల హక్కుల విషయంలో , వారి రక్షణ విషయం లో కాని నిబద్దత ఉందా ? స్త్రీల  హక్కులను గౌరవించని వారికి వారి విజయాలను పండుగలుగా చేసుకునే అర్హత ఉందా? దేవతను కొలవడం అంటె పూలు పేర్చడం , పసుపు కుంకాలు చల్లడం , ఆటలు ఆడడం , పాటలు పాడడం , చివరకు వారిని చెర్లో కలపడం లేక జల విహారం చేయించడం ! ఇంతేనా ! అమ్మలను కొలవడం అంటే ! ఇదేనా మన పండుగల అంతరార్దం !.పుట్టే శిశువులు ఆడపిల్లలు అని తెలిసి గర్భస్రావాలు చేయించుకునే వారికి, కోడళ్లను కాల్చుకు తినే అత్తలకు,అత్తలను  హింసించే కోడళ్ళకు ,  వీరందరికి బ్రతుకమ్మ అడే నైతిక అర్హత ఉందా? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పవచ్చు .   ఇలాంటి వారు ఎన్ని పూలు పేర్చి ఎంత అందంగా అడి  పాడినా  వారిని బతుకమ్మ తల్లి అసహ్యించుకుంటుందే తప్పా ఆశీర్వదించదు. కాబట్టి బతుకమ్మ దీవెనలు పొందాలి అంటే కనీసం సాటి స్త్రీల పట్ల మానవతా ధర్మం ప్రదర్శించగలగాలి . బతుకమ్మ మూర్తిని ఎంత ఎత్తుగా పేర్చారు అన్నది కాదు ప్రదానం, మీలోని అమ్మ తనం ఎంత  ఉన్నతంగా ఉన్నదన్నది బతుకమ్మ తల్లి దీవెనలుకు  కొలమానం.
                                                                             


                        ఇక పొతే , రాజ్యం యొక్క ప్రదాన కర్తవ్యం ప్రజా రక్షణ అందులో భాగమైన  మహిళా రక్షణ  . ప్రజలకు ముక్యంగా స్త్రీలకు రాజ్యంలో రక్షణ కరువైనపుడు అట్టి రాజ్యం లో స్త్రీ శక్తులను కొలిచే పండుగలు ఎంత సంబరంగా జరుపుకున్నామని బావించినా నిష్పలమే ..   ప్రజలు ముఖ్యంగా స్త్రీలు ఆనందంగా బతుకమ్మ, దసరా  లాంటి పండుగలు  జరుపుకోవాలంటె  పాలకులు మహిషాసుర మర్దిని ల వలే విజ్రుభించి , స్త్రీ హింసకు కారకులు అవుతున్న మ్రుగాళ్ళ ను, వారికి సహకరించే స్త్రీలను  మట్టుపెట్టవలసిందే . అప్పుడే  స్త్రీలకు నిజమైన బతుకమ్మ , దసరా పండుగలు. అట్టి పాలనను మన నాయకులు మనకు అందిస్తారని ఆశిద్దాం.

                                                       

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన