ఇంటర్నెట్లో అమ్మాయిలని నగ్నంగా మార్చి 10 డాలర్లకు అమ్ముకుంటున్న 'అమ్మకు పుట్టని వాళ్ళు' !

                                                                           


                                     ఈ  సమాచారం ముఖ్యంగా అమ్మాయిల కోసం. ఆడపిల్లలు తమకు ఏంతో స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఉన్నాయని బ్రమపడి మగపిల్లల తో సమానంగా తమ బావాలనే కాక ,లైక్ ల కోసం తమ పోటోలను పెస్బుక్ తదితర సోషల్ నెట్వర్క్ లలో పెడుతున్నారు . ఇలా తమ అందమైన పోటోలను తమ పుట్టిన రోజు అనో , మరేదో సాధించిన రోజు అనో ప్రకటిస్తూ  పేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు , ఇక కొంతమంది అందగత్తెలు అయితే ఏకంగా పోజులు ఇస్తూ "నేనెలా ఉన్నా ప్రెండ్స్ " అని అడుగుతుంటే  ముక్కూ ముఖం తెలియని మగవాళ్ళు సైతం లక్షలాదిగా లైకులు మీద లైకులు ఇస్తుంటే ఇక ఆ ఫొటో పెట్టిన ఆడపిల్లల ఆనందానికి అంతే ఉండదు అనుకుంటా . ఇక అలా లైకులు పెట్టె వారిలో కొంత మంది అయితే ఏకంగా తమ విరహ బాధను తెలియచెయ్యడాలు , అమ్మాయి ఫోన్ నంబర్ లు అడగడాలు లాంటివి చేస్తూ తమలోని చపలత్వాన్ని ఫేస్ బుక్ సాక్షిగా చాటుకుంటున్నారు. అయినా సరేసదరు ఫొటోలు పెట్టిన అమ్మాయిలకు అది కాంప్లిమెంట్ గానే అనిపిస్తుంది కాబోలు .


                       అందమైన అమ్మాయిల పోటోలను చూసి ఆనందిస్తే ఎవరికీ అబ్యంతరం ఉండదు . కాని అవే పోటోలను బహు చాకచక్యంగా ఇతరుల పోటోలతో మార్పింగ్ చేసి ఇంటర్నెట్లో పెడితే అనేక అనర్దాలు జరుగుతున్నాయట . అటువంటి పొటోలు తమ భార్యలవే అని బ్రమపడిన కొంత మంది భర్తలు తమ భార్యల నుండి విడాకులు కోరుతుంటే , ఎంగేజ్ అయిన ఆడపిల్లలు అశ్లీల బొమ్మలు ఇంటర్నెట్లో దర్సన మివ్వడం చూసి , పెండ్లిళ్ళు రద్దు చేసుకున్నవారు కొందరు . ఇలా  ఇంటర్నెట్లో అమ్మలకు పుట్టని వారు చేసే మార్పింగ్ పనులకు అమాయకులైన ఆడపిల్లలు బలి కావాల్సి వస్తుంది .

                           ఈ మద్య కొందరు ఒక ముఠాగా ఏర్పడి పెస్బుక్ తదితర సోషల్ నెట్ వర్క్ లలోని అందమైన ఆడపిల్లల పోటోలోని ముఖం వరకు కాపి చేసి పోర్న్ సైట్లలోని మగువల నగ్న పోటోలతో మార్పింగ్ చేస్తున్నారట . ఇవెలా ఉంటున్నాయి అంటే నూటికి నూరుపాళ్ళు ముఖమూ శరిరం ఒకరిదే అన్నంతగా . అలా మార్పింగ్ చేసిన పోటోలను ఒకొక్కటి 10 డాలర్లకు అమ్ముకున్తున్నారట . అలా మార్పింగ్ చేయబడిన పొటోలు సోషల్ వెబ్సైట్లలో , ఇతర పోర్న్ సైట్లలో దర్సనమివ్వడం వలన పైన చెప్పిన అనర్దాలు కలుగుతున్నాయి . ఇలా తమ ఫొటోలు మార్ఫింగ్ లకు గురి అయిన ఆడపిల్లలు ఎంతో ఆవేదనకు లోనయి చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు .

                                  కాబట్టి అమ్మాయిలు తమ పోటోలను లైక్ ల కోసం సోషల్ వెబ్సైట్లలో పెట్టక పోవడమే ఉత్తమం ! ఆడవాళ్ళ పోటోలను చూసి చొంగ కార్చుకునే మగ బుద్ది ఉన్నంత కాలం  స్త్రీలే కాదు , వారి పోటోలూ వ్యాపార వస్తువులే! కాబట్టి వెనుకా ముందు ఆలోచించకుండా అందమైన అమ్మాయిలు ఫొటోలు సోషల్ నెట్వర్క్ లో పెడితే చివరకు ఆ ఫొటోలకే దండలు వేసే పరిస్థితి వస్తుందని గుర్తుఉంచుకుని తదనుగుణంగా అమ్మాయిలూ వారి కుటుంబ  సభ్యులు వ్యవహరిస్తే మంచిది. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన