ఆమె ను అతడు 3 ఏండ్ల నుండి లాడ్జ్ ల వెంట తిప్పుతూ రేప్ చేస్తున్నాడు అంటా !!



                                     కొంతమంది అత్యాచార బాదితులం అని చెప్పుకునే వారి కంప్లయింట్ లు చూస్తుంటే , వారు పోలీస్ వారి చెవిలో మాత్రమే కాకుండా యావత్ సమాజం చెవిలో కూడా ఎంతెంత పెద్ద పెద్ద పువ్వులు పెట్టాలని చూస్తున్నారో యిట్టె అర్థమై పోతుంది . ఒక స్త్రీ పై అత్యాచారం జరిగిందని రుజువు చెయ్యడానికి ఆమె మీద అనేక రేప్ లు జరిగి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్కటంటే ఒకే సారి ఆమె ఇష్టం లేకుండా ఏ పర పురుషుడైనా లయింగిక దాడి జరిపితే చాలు. అది అత్యాచారం గానే పరిగణిస్తారు. ఒక వేళా ఆ పురుషుడితో కొంతకాలంగా సంబంధం కలిగిఉన్నపటికి , వారి మధ్య వైవాహిక సంబంధం లేకుంటే , ఏ ఒక్కసారి అయినా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిపే లయింగిక దాడిని అత్యారాచారం గానే పరిగణిస్తోంది ఇండియన్ పైనల్ కోడ్ లోని 376 సెక్షన్ . మరి ఇంత స్పష్టంగా చట్టాలు ఉన్నప్పుడు  కాకమ్మ కధలు చెపుతూ అటు కోర్టులను ఇటు సమాజాన్ని నమ్మింప చేయడమెందుకో?

     పై ఉపోద్గాతం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చ్చిందంటే ఇటీవల ముంబాయి దగ్గర థానే లో ఒక స్త్రీ ఇచ్చిన కంప్లయింట్ చూసి . ఆమె కార్మికురాలు  అంట . ఆమెకు 50 ఏండ్ల పై బడిన మరో కార్మికుడితో  అనుకోని పరిస్థితిలో  అక్రమ  సంబంధం ఏర్పడిందంట . అంతే ! ఆతను ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు అంట . తన కోరికను తీర్చక పొతే తమ మధ్య ఉన్న సంబంధం గురించి ఆమె భర్తకు చెపుతానని బెదిరించేవాడట . దానితో ఆమె తెగబయపడి పోయి అతను తీసుకు వెళ్లిన లాడ్జ్ కల్లా  వెళ్ళేది అట . అతడు అక్కడ ఆమె పై అత్యాచారం చేసే వాడట . ఇలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు ఏకంగా 3 ఏండ్లు నిరంతర అత్యాచారం చేస్తూనే ఉన్నాడు అంట . 

     కొంత కాలం క్రితం ఆమె భర్త చనిపోయాడు అట. అయినా ఆమె మీద అతడు అత్యాచారం ఆపలేదట . ఎందుకయ్యా అంటే , ఇప్పుడు భర్త లేడు  కాబట్టి తమ విషయం ఆమె పిల్లలకు చెపుతాను అని బెదిరించడం మొదలుపెట్టాడట . దానితో ఆమె మరింత బెదిరిపోయి అతనితో లాడ్జ్లకు వెళుతూ అత్యచారానికి గురువవుతూ బాధ పడుతుంది అట. అలా జరుగుతున్న క్రమం లో ఎందుకో  ఆమెలో  దైర్యం కలిగి, పోయిన బుధవారం  పోలీస్ స్టేషన్ కి వెళ్లి   3 ఏండ్లుగా తనపై అతడు జరుపుతున్న  అత్యచారా కాండ గురించి  వివరించే సరికి , పోలీసులు మారు మాట్లాడకుండా ఆమె చెప్పినది రాసుకుని అతగాడి మీద రేప్ కేసు పెట్టేసరికి , అతగాడు పారిపోయాడు అంట . ఇక పోలీసులు టీం లుగాఎర్పడి అతడి కోసం వెతుకులాట మొదలు పెట్టినట్లు ఉంది. 

    ఇక ఇది మహా ఘోర కాండ కాబట్టి ఈ  కేసు గురించి హిందుస్తాన్ టైమ్స్ లో కూడా ప్రచురించారు. కావాలనుకుంటే మీరు కూడా లింక్ క్లిక్ చేసి చదువుకోవచ్చు. ఇలాంటి విపరీత కహానీలు వలననే  కంప్లంట్ల  మీద విశ్వసనీయత కలుగకుండా పోతుంది. దీని వలన వీరు  చెప్పే విషయాల పట్ల కూడా పోలీసులు మెకానికల్  గా కేసులు పెడుతుంటే , చివరకు రాజీల ద్వారా కేసులు కొట్టేయడం జరుగుతుంది. కానీ భారతీయ సమాజం లో మాత్రం రేప్ కేసులు నానాటికి పెరిగిపోతున్నట్లు  లెక్కలు చెపుతున్నాయి. తప్పుడు కేసులు వలన అంతిమంగా నష్టపోయేది నిజమైన బాధిత స్త్రీలే .వీగిపోయిన  రేప్ కేసులు అన్ని సమాజం లో బాధిత స్త్రీలకు చెరుపు చేసేవే. ఒక్కసారి సీరియస్ నేరాలకు సంబంధించి, సమాజం లో   సెన్సిటివ్  నెస్ కోల్పోతే ఎంత పెద్ద ఘోరం జరిగినా  పెద్దగా స్పందన ఉండదు. అలా సెన్సిటివ్ నెస్ లేక సీరియస్ నెస్  కోల్పోయేలా చేసేవే పైన చెప్పే అత్యాచార కహానీలు అన్ని  .  


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన