విప్పదీసి చూపించడం తప్పా , విడమర్చి చెప్పిందేమిటి ?ఈ వివరం తక్కువ వీడియో సందేశం లో!

                                                             



 భారత దేశం లోని స్త్రీలు పూర్తిగా  సాంప్రదాయ వస్త్రదారణ వైపు మొగ్గు చూపితే ఎక్కడ తమ బట్టల కంపెనీలు మూసుకోవలసి వస్తుందో అన్న బెంగ ఎక్కువైనట్లుంది   బట్టలు వ్యాపారులకి.  అందుకే పని గట్టుకుని యువతను రెచ్చగొడుతున్నారు . భారతదేశం లో స్త్రీకి అసలు స్వాతంత్ర్యం లేదు అనే సందేశాలు తో కూడిన వీడియోలు తీసి ప్రపంచ దేశాలలో భారతీయ ఔన్నత్యాన్ని బజారుకీడుస్తున్నరు.

 ఉదాహరణకు ఈ మధ్య ఒక  వీడియోను చూడడం జరిగింది . అందులో ఒక అమ్మాయి తో ఏమి చెప్పించారు అంటే తనను  బయటివారే కాక ఇంట్లోని తండ్రి , అన్నదమ్ములు కూడా రేప్ చేస్తున్నారు అని. ఇలా చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఎమిటి? ఎక్కడొ ఒకటి  రెండు చోట్ల జరిగేదానిని జనరలైజ్ చేయడమేమిటి? అంటే "మీకు ఇంట్లో కూడా స్వేచ్చా లేదు , మిమ్మల్ని మీ కుటుంబ సబ్యులే హింసిస్తున్నారు కాబట్టి , వారిని వదిలించుకుని  బయటకు వచ్చేసి మా కంపెనీ బట్టలు వేసుకుని బజార్లో తిరగండహో " అని ప్రచారం చేస్తున్నారా?. మొన్న బహిరంగ ముద్దులు , కౌగిళ్ళ  కార్యక్రమం జరిపినా ,  ఇటువంటి చవకబారు విడియో సందేశాలు మార్కెట్లో విడుదల చేస్తున్నా వీటి వెనుక అసలు ఉద్దేశ్యం పరువుగా ఉంటున్న భారతీయ స్త్రీలను బజార్లోకి తీసుకువచ్చి, తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా మలచడమే అసలు ఉద్దేస్యం. దానికి అడ్డంగా ఉన్న భారతీయ సాంప్రాదాయ విదానాలను నాశనమ్ చేయాలని వారు కంకణం కట్టుకున్నారు .

  మన తెలుగు అమ్మాయిలూ పరికిణిలు ఓణీ లు మానేసి, పూర్తిగా పంజాభీ అమ్మాయిలుగా మారిపోయిన వేళ మనవాళ్ళు ఎవరైనా అబ్యంతరం చెప్పారా? పల్లెటూళ్ళో ఆ మార్పును ఆహ్వానించారు . కేవలం ఎబ్బెట్టుగా ఉండే డ్రెస్ లు వేసుకుని తిరగకండమ్మా అని చెపుతున్నారు పెద్దలు . అది తప్పా? రేప్ లకు డ్రెస్ కోడ్ కి సంబందం లేక పోవచ్చు. కానినేరస్తులకి  వ్యక్తులను తప్పుగా  అంచనా   వేయడానికి  డ్రెస్ కూడా ఒక కారణం కావచ్చుగా . ఇది ఎలాగో ఒక ఉదాహరణ చెపుతాను.
                                                                       


                                             ఒక వీదిలో ఒక ఆబోతు ఉంది . దాని దగ్గరకు ఎవరు వెళ్ళినా  పొడిచే స్వబావం కలది . దానికి ఎర్రని వస్తువులు ఏది కనపడినా అమాంతం దానిమీదకు వెళుతుంది . అందుకే ఎవరూ ఎర్రని దుస్తులు దరించి అది ఉన్నవైపుకు వెళ్ళరు. నా డ్రెస్ నా ఇష్టం ఎర్రని దుస్తులు దరించి దాని దగ్గరకు వెళితే " నా కొమ్ములు , నా ఇష్టం" అని పొడిచేస్తుంది అది . ఆ తర్వాత కోపంతో దానిని నాలుగు బాదినా , నష్టం జరిగేది ఎవరికీ? ఎర్ర దుస్తులు వేసుకున్న వారికే కదా? అటువంటి సమయం లో " ఎందుకమ్మా ఎర్ర దుస్తులు వేసుకువచచ్చావు? దాని గురించి తెలియదా ? అని పెద్దమనిషిగా అనటం తప్పా? ఎద్దును అనలేక నన్నంటారా  అని  సలహా ఇచ్చిన వారిని బండ భూతులు తిడితే ఎలా ఉంటుంది ? ఇదీ అంతే! ఎద్దు లాంటిదే కొంతమంది మగబుద్ది . దానిని గమనించి మసలుకోవడO  విజ్ఞత అనిపించుకుంటుంది తప్పా , స్వేచ్చ లేని తనం  కాదు. ఇంట్లో ఆడపిల్లలు ఏ డ్రెస్ లు వేసుకోవాలో ఆ ఇంటి వాతావరణమే వారికి చెపుతుంది . ఇందులో తండ్రి అన్నదమ్ములు కంటే తల్లే ఎక్కువ శ్రద్ద తీసుకుంటుంది . కొడుకైనా సరే విడిచేసుకుని బజార్లో కెళతాను అంటే ఒప్పుకుంటారా? జాగర్తలు చెప్పడం రేపిస్టులను ప్రోత్సాహిస్తుందా? మీ ఇష్టం వచ్చిన డ్రెస్ లు వేసుకోండి అని అనడం రేపిస్టులను ప్రోత్సాహించడం అవుతుందా? విజ్ఞత గలవారు ఆలోచించాలి.


  మనది భారతదేశం . ఎన్నోవస్త్రసాంప్రాదాయాలు ఉన్నాయి . అందులో ఏది పాటించినా ఎవరూ అబ్యంతరం చెప్పరు. విదేశి సంస్కృతికి చెందిన దైనా పూర్తిగా లేక చాలా వరకు ఒంటిని కప్పే వస్త్రదారణను మన పెద్దలు అనుమతిస్తారు .కానీ మరీ వీదిలో వెళుతుంటే  అందరూ తననే చూడాలనుకుని వేసే అర్ద నగ్న దుస్తులు కొన్ని తప్పుడు సంకేతాలను ఇస్తున్నాయి . అందుకే ఈ బాదలన్ని . ఒక చానల్ ప్రోగ్రామ్లో చూసాను . ఒక నటిమణి అర్ధనగ్న వస్త్రదారణతో వచ్చింది . ఆమె గారు సోపామీద కూర్చున్నప్పుడు ,ఎంత ఇబ్బంది పడుతుందో అర్దమవుతుంది. తన కాళ్ళను దిండుతో కప్పుకుని తన ఔన్నత్యాన్ని కాపాడుకోవటానికి నానా కష్టాలు పడింది . ఎందుకు? ఆమె భారతీయ స్త్రీ కాబట్టి . అదే ఇంగ్లాండ్ లో ఆ అవసరం ఉందా? అది వారికి అలవాటు. మనకు గ్రహపాటు. అదే మనకు కావాలనుక్లుంటె మనం అంతా తెల్లోళ్లగా మారడమో , లేక ఇంగ్లాండ్ వెళ్లి పోవడమో, ఏది సులబమైతే అది చేస్తే  మంచిది  .


మగ బుద్ది గురించి ఈ బ్లాగులో ప్రచురించిన మరిన్ని టపాల కోసం  క్లిక్ చేయండి  
                                            (19/11/2014 Post Republished)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన