ఆలూ లేక పోయినా , చూలు లేకపోయినా ఖమ్మం లో అబ్బాయి పుడితే మాత్రం కేంద్ర మంత్రి పదవి ఖాయమట !

                                                     


అయన గారు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు . రాష్ట్ర విభజన జరుగక ముందు, అయన పార్టి పెట్టిన కొత్తలో 42 నియోజకవర్గాల్లో అయన పార్టికి కొంత హవా ఉన్న మాట నిజమే కావచ్చు . కాని ఆయనను ఆర్దిక నేరాల విచారణలో బాగంగా 18 నెలలు జైలులో పెట్టడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు వలన అయన గారి పార్టికి జనం లో ఆదరణ తగ్గుతూ రావడం మొదలు పెట్టింది . చివరకు రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 3 ప్రకారం విభజన  చేసినా అబ్యంతరం లేదని తొలుత ప్రకటించిన అయన , అ తర్వాత నాలుక్కరచుకుని జై సమైక్యతాoద్ర  అనే సరికి తెలంగాణా లో ఆయన్ని నమ్ముకుని ఉన్న ఆయనగారి విరాభిమానులు ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ పార్టిని దాదాపు ఖాళి చేసారు
               ఏదో అయన మిద ఉన్న అభిమానంతోనో , లేక అయన తండ్రి గారి మిద ఉన్న అభిమానంతోనో ఓట్లు పడవచ్చు అనే దింపుడు కళ్ళాలు ఆశ  ఉన్నవారు తప్పా దాదాపు తెలంగాణా లో అయన పార్టిలోఅనుభవమున్న నాయకులు ఎవరూ లేరనే చెప్పవచ్చు . అంటే 17 నియోజక వర్గాల్లో అయన గారి పార్టి కి నమ్మకమైన  ఆశలు ఏమి లేవు .ఇక మిగిలింది సిమాంద్ర లోని 25 పార్లమెంటరి సీట్లు . అక్కడ కూడా ఇతర పార్టీలతో సీట్లు పంచుకోవలసిందే తప్పా , స్విప్ చేసే పరిస్తితి లేదు . మరి అలాంటి పరిస్తితుల్లో నిన్న ఖమ్మం ఎన్నికల సభలో తన పార్టి అబ్యార్దిని M.P చేస్తే , ఆయన్ని కేంద్ర మంత్రిని చేసే బాద్యత తనది అని బల్ల గుద్ది  మరి ఎలా చెప్పగలిగాడు ?

  కేంద్రం లో ఏ పార్టి ప్రబుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో తెలియదు . అయితే కాంగ్రెస్ , కాకుంటే B.J.P ప్రబుత్వం ఏర్పాటు చేస్తుంది అని సామాన్య అంచనా .పోల్ సర్వేలు అన్ని B.J.P  కే చాన్సేస్ ఎక్కువ ఉన్నాయని అంటున్నాయి . రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ మరియు B.J.P వారు సమాన కారకులని సిమాంద్ర ప్రజలు ఆ రెండు పార్టీలు మిద గుర్రుగా ఉన్నారు .ఒక వేళ సిమాంద్ర లోని ప్రజలు అన్ని సైట్లను Y.R.S  పార్టికి కట్ట బెట్టినా , అది కాంగ్రెస్ , B.J.P  మిద వ్యతిరేకతోను , మరియు జగన్ గారు విర సమైక్య వాది  అని నమ్మడం వలననే తప్పా , వేరు కాదు . మరి అటువంటి ప్రజల చేత పొందిన సీట్లను తిరిగి డిల్లీలో వారికె తాకట్టు పెడతారా ?

   కేంద్రం లో ఏ పార్టి వచ్చినా తను ఆ పార్టీకే మద్దతు ఇస్తాను అని గాడంగా నిర్ణయించుకుంటే తప్పా , ఖమ్మం M.P ని కేంద్ర మంత్రి చేస్తాను అని అంత గన్ షాట్ గా చెప్పరు. అంటే తమ పార్టి  సమైక్యతా పేరుతొ ,జాతీయ పార్తిలను విమర్శించి సంపాదించిన వోట్లను , డీల్లికి తీసుకు వెళ్లి అదే జాతీయ పార్టీలతో బెరాలాడి , వారికీ తాకట్టు పెట్టి తాము ఒకటో రెండో మంత్రి పదవులు తీసుకోవచ్చు అనే ఉద్దేశ్యం ఉండబట్టే అలాంటి గన్ షాట్ ప్రకటన చేసి ఉండాలి . మరి దీనిని సిమాంద్ర ప్రజలు స్వాగతిస్తారా ? ఒక సిద్దాంతం అనేది లేకుండా , చనిపోయిన వారి పేరులు చెప్పుకుని , డబ్బులతో ఎవరినైనా కొనేయగలo అనే దిమాతో, రాజకీయాలను వ్యాపారం చేయ గలవారు ,  ప్రజలు అభిమాన్నాన్ని అమ్ముకోవడం తప్పా వేరేమి చేయగలరు ?

     కాబట్టి తెలుగు ప్రజలు తమ దగ్గరకు వచ్చె ప్రతి రాజకీయ నాయకుణ్ణి నిలదీసి ప్రస్నిమ్చాల్సిన అవసరం ఉంది . వారి పార్టి కేంద్రంలో ఎవరికీ మద్దతు ఇవ్వబోతుందో తెలుసుకున్న తర్వాతనే ఆయా పార్టీలకు వోట్లు వేయాలో వద్దో నిర్ణయించుకోవాలి . ఇప్పటికే పార్టీలకు రాజ్యాంగం అన్నా , రాజ్యాంగ ప్రక్రియలు అన్నా బొత్తిగా గౌరవం లేకుండా పోయింది . పార్లమెంటు నే "దొరల దివాణం " గా మార్చిన ఘనత పాలకులది . దాని వలన ఎంత నష్టం జరిగిందో సిమాంద్ర ప్రజలకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు . కాబట్టి , పార్టి ఏదైనా సరే రాజ్యంగా పద్దతులకు లోబడి పని చేసే వారినే ఎన్నుకోవడం తెలుగు ప్రజల తక్షణ కర్తవ్యమ్ . దొరలూ, రాజులు , వారి అహంకార పూరిత పాలనా పద్ధతులకు భరత వాక్యం పలుకవలసిన తరుణమిది . మన వోట్లను తీసుకు వెళ్లి డిల్లి పాలకుల వద్ద పెట్టె నాయకులకు వోట్లు వేసే బదులు , డైరెక్టుగా డిల్లి పార్టీల  వారికే వోట్లు వేస్తె పోలా?
కనీసం తాము ఎన్నుకున్న వారే తమకు నాయకులుగా ఉన్నారు అనే తృప్తి కలుగుతుంది . మద్య దళారీలు అవసరమా ? ఆలోచించండి !

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన