Friday, 21 October 2016

ఎందరినో వల వేసి పట్టినోడు, అమ్మాయి వలలో పడి జైలు పాలయ్యాడు!

                                                 తెహెల్కా! దీని పేరు చెపితే తప్పులు చేసే వారికి కొంచం గుండె గుబేలు మంటుంది! పెద్ద పెద్ద వారిని తన స్టింగ్ ఆపరేషన్ ల ద్వారా పరేషాన్ చేసిన ఘనత ఈ  మాగజైన్ కు ఉంది. మొట్టమొదటగా 2000 సంవత్సరం లో క్రికెట్ మాచ్ పిక్సింగ్ కుంభ కోణం ని తన స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయట పెట్టి సెన్సేషనల్ అన్న తన ఉనికిని బహిర్గత పరచింది. అలాగే రక్షణ ఆయుదాల కుంభకోణం కేసులో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తో ఏకంగా రెండు జాతీయ పార్తీల నాయకులే రాజీనామాలు చెయ్యాల్సి వచ్చింది. అందులో మన తెలుగు వారైన B.J.P.బంగారు  లక్ష్మన్ గారు ఒకరు. ఇలా ఏది చేసినా ఒక సెన్సేషనల్ గా చేస్తూ , రాజకీయ నాయకులే కాక ఇతర వర్గాల వారి గుండెల్లో కూ డా రైళ్ళు పరిగెత్తించ గలిగింది. తెహెల్కా అంటే తెలుగులో సంచలనం అని అర్దం. దీని వ్యవస్తా పకులులో ఒకరైన "తరుణ్ తేజ్ పాల్" దీనికి ప్రదాన సంపాదకులు కూడా . ప్రముఖ పెమినిస్ట్ షోమా చౌదరి మేనిజింగ్ ఎడిటర్. వీరి పత్రిక పాపులర్ అయ్యాక చాలా మంది నుంచి వీరు డొనేషన్ల రూపం లో డబ్బులు వసూలు చేసినట్లు వీరి మీద ఆరోపణలు ఉన్నాయి .

     అయితే అదంతా ఒక ఎత్తు. తెహెల్కా నిర్మాత తరుణ్ తేజ్ పాల్ ఉదంతం ఒక ఎత్తు. ఎందరికో తన స్టింగ్ ఆపరేషన్ ల ద్వారా నిద్ర పట్టకుండా చేసిన అయన , ఎవరూ స్టింగ్ ఆపరేషన్ చెయ్యకుండానే తన అతి తెలివిక్ తానే డంగై పోయాడు. గురివింద తన క్రింద ఉన్న నలుపు ఎరుగదు అన్నట్లు, ఇంతమంది తప్పులేన్నిన తేజ్పాల్ కు ఒక దుర్బుద్ధి ఉంది అనేది వారం క్రితం వరకు ఎవరకూ తెలియదు. ప్రపంచ స్తాయిలో అత్యంత ప్రబావ శీలురిలో ఒకడిగా పేరు గాంచిన తేజ్ పాల్ కు అమ్మాయిలను చూస్తె అతనిలోని "మగబుద్ది " ఆగి చావదట! అందుకే తన స్నేహితుడు కూతురు అనే ఇంగిత జ్ఞానం కూడా  లేకుండా, గోవాలో ఒక హోటల్ లిప్ట్ లో అ అమ్మాయిని తాక రాని ప్రాంతాల్లో తాకి అసబ్యంగా  ప్రవర్తించాడట  ! దీనికి నివ్వెర పోయిన అ అమ్మాయి వెంటనే తమ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ కి సెల్ మెసేజ్ ద్వారా విషయం అంతా తెల్పితే ,తెహెల్కా ఉద్యోగులు అంతా స్తన్నై  పోయారట!

   అ తర్వాత అందరికి విషయం తెలిసి పోయిందని గ్రహించిన "తేజ్ పాల్"  తన స్టింగ్ ఆపరేషన్ తెలివితేటలూ అ అమ్మాయి మీదా ప్రయోగించ బోయాడు. తెలివిగా ఒక ప్రైవేట్ మెస్సేజ్ లో తాము ఇద్దరం మద్యం  మత్తులో ఉండటం వలన, సరస సంబాషనలకు దిగి, ఆ తర్వాత తానేమి చేస్తున్నానో తెలియని స్తితిలో అలా చేసాను అని కాబట్టి తనను క్షమించమని చెప్పటమే కాక, 6 నెలలు పత్రికా ఎడిటర్ పదవికి దూరంగా ఉంటాను  అని స్వచ్చంద శిక్ష విదించుకున్నాడు. దానికి గ్రేట్ పెమినిస్ట్ షోమా చౌదరి కూడా  వంత పాడింది . కానీ ఆ లేడి జర్నలిస్ట్ అతని మెసేజ్ సారాంశాన్ని ఖండిస్తో , తామేమి తాగిన స్తితిలో లేమని, ఆతను కావాలనే తనను లైంగిక వేదింపులకు గురిచేసాడని తిరుగు మెసేజ్ పెట్టింది. ఈ  లోపు ఈ  నోటా ఆ నోటా  పాకిన  విషయం జాతీయ మీడీయాలో ప్రచార మయ్యేసరికి గోవా ప్రభుత్వం సుమోటొ గా కేసు విచారణ చేపట్టింది.

     తెలివిగల కుందేలు తెలివి తక్కువ వాడి వలలో పడిందని సామెత! నిజంగా తేజ్ పాల్ మెదలకుండా ఉన్నట్లైతే అతనికి కనీసం  ముందస్తు బెయిల్ దొరికేది. కాని స్వయం ప్రకటిత క్షమాపణ, శిక్షలు అతని చర్యలను బలపరచే రుజువులుగా   మారాయి. గోవా సెషన్స్ కోర్టు అతనిని  దోషి అని ప్రాదమికంగా నిర్దారించడానికి , అతని తెలివితక్కువ పనులే తోడ్పడ్డాయి. సెషన్ కోర్టే  అతనిని దోషి అందంటే ఇక అతనికి దాదాపు శిక్ష ఖాయమనే బావించవచ్చు, ఏవైనా అద్బుతాలు జరిగితే తప్పా! ఇలా తెలివి గల తేజ్ పాల్ అమ్మాయిని గెలికి అష్ట కష్టాల పాలయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన వాడు , ఈ  దేశ మ్రుగాళ్ళలో ఒకడిగా కటకటాల పాలు గావడం దేవుని లీల గాక మరేమిటి? దేవుని లేల ఎందుకు అంటున్నాను అంటే , తన చర్యల ద్వారే తానూ తప్పించుకోలేని పరిస్తితులు కలుగ చేసినందుకు! వేట గాడు ఎప్పటికైనా వేటలోనే చనిపోతాడు అంటరు. అలాగే అమ్మాయి వేటలోనే తేజ పాల్ బుక్కవడం విశేషమే మరి!
                                                      (2/12/2013 Post Republished).

Thursday, 20 October 2016

"పని నేర్చుకోండి ముందర,పెళ్లికెందుకు తొందర".పథకం అమలులో సక్సెస్ అవుతున్న ఇండియన్ యువత!!?


                                 
                                                                     
కొన్నేళ్ల క్రిందట మన గవర్నమెంట్ వారు విశేషం గా ప్రచారం చేసిన స్లోగన్ ఇది. ఆ రోజుల్లో తక్కువ వయస్సులో వివాహాలు చెయ్యడం,ప్రజలకు కుటుంబ నియంత్రణ పద్దతుల మీద అవగాహాన లేకపోవడం వలన కనీస వయస్సు రానిదే పెండ్లిళ్లు జరిపితే పుట్టబోయే పిల్లల ఆరోగ్యాలు,మాతా శిశు సంరక్షణ ఇవ్వన్నింటిని ద్రుష్టిలో పెట్టుకుని ’ముందు ఉద్యోగం తర్వాతె పెళ్లి’ అనే నినాదం ముందుకు తెచ్చారు.

  అంతవరకు బాగానే ఉంది.అందరికి ఉద్యోగాలు లేక ఉపాది కల్పనా అనేది అందని పండు అయింది. ఎక్కడికి వెల్లిన  ఏ పని దొరక్కపోయే సరికి ఏం చెయ్యాలో యువతకు పాలు పోలేదు.కావాల్శిన పని దొరకడం ఎలాగు లేట్ అవుతుంది కాబట్టి, తమకు చేత నైన పని చెయ్యడం మొదలుపెట్టారు.అదేమిటంటే ప్రేమించడం,ముచ్చట తీర్చుకోవడం?ఈ  పని నేర్చుకోవడం లో వారికి ఇతోధికంగా సహాయం చేస్తున్నవి విదేశీ సంస్కృతికి ప్రతిరూపమైన డేటింగ్ సైట్లు

                           ఇక ఈ విదంగా పదవ తరగతికి వచ్చేసరికి "గర్ల్ ఫ్రెండ్" లేని జీవితం ఒక జీవితమా? బాయ్ ఫ్రేండ్ లేని బ్రతుకూ ఒక బ్రతుకేనా అనుకుంటు,ఊహాలోకాలలో విహరించి జీవితాన్ని ఎంజాయి చెయ్యడాలు,అన్ని ముచ్చట్లు తీర్చుకోవడాలు, ఆ తర్వాత పెద్దలకు తెలిసి మందలించడాలు, ఆ తర్వాత టా,టా బై,బై లు చెప్పుకుని ఎవరి పెళ్లిళ్ళు వారు చేసుకోవడాలు అంతా గప్ చిప్.

                                                                             

   అయితే దీని వల్ల సమాజానికి వచ్చే నష్టం ఏముంది ? నిజమే పెళ్లాయాక కరేక్ట్గా ఉంటే చాలు గదా! అంతకు ముందు ఎవరెలా ఉంటే,అని అనే మోడ్రన్ వాదులు అయిన పెద్దలూ ఉన్నారు . వారు  ఇదందరికి కామన్ అనుకోవచ్చు. అంతా మనం అనుకున్నట్టు ’సుఖమే’అయితే మన పెద్దలకి ఇటువంటి "సుఖ సంసారాలు" చేసుకోవడం చేతకాకనా ఈ నిబందనలన్ని? అందుకే భారతదేశం లో జరగరాని నష్టం జరిగి ఇప్పటికి కొనసాగుతూనే ఉంది .

                        పై విదంగా పనిమంతులు సంఖ్య నానాటికి పెరిగిపోతుండటం తో     ఆ తర్వాత జరిగిన పరిణామం ఏమిటంటే ,వీరి పనితనానికి మెచ్చి భగవంతుడు వీరికొక వ్యాదిని ప్రసాదించాడు. అదే ఎయిడ్స్.దాని దెబ్బకు 13 నుండి 20 సంవత్సరాల వారు నాశనమై పోయారు.ఈ రోజున కొన్ని గ్రామాలలో కనపించే పరిస్తితి చాలా దారుణంగా ఉంది. కొన్ని పట్టణాలలో అదిక శాతం యువతరం దీని బారిన పడ్డారు.చివరకు మన రాష్ట్రం దేశంలోనే అత్యదిక వ్యాదిగ్రస్తులున్న రాష్ట్రంగా మారింది.చివరకు మన ప్రభుత్వాలు ఏమి చెయ్యలేక"మీ అమ్మ కడుపు మాడా, కనీసం నిరోద్ లైనా వాడండ్రా" అనటం మొదలు పెట్టింది అయినా "అమ్మల కడుపులు మాడటం’తప్పటం లేదు.
 ఇదంతా దేనివలన అనుకున్నారు అదే,
           
                              "పని నేర్చుకోండి ముందర,పెళ్లికెందుకు తొందర".అనే స్లోగన్ ని మన్ వాళ్లు వేరే రకంగా అమలు చేసినందు వల్ల!
                                       (23/12/2012 Post Republished)

                                          

Wednesday, 19 October 2016

ఇంటి కుక్కను కట్టెసుకోపోయినా , ఇంట్లో కొడుకును అదుపులో పెట్ట్టెసుకోలేక పోయినా , ఇంటి ముందు ఇలాగే ఉంటుంది మరి ! .

                                                                 
           
                                                                       
                                       మనం సాదారణంగా ఇంట్లో పెంచుకునే కుక్కలను కట్టెసుకుంటాం . ఎందుకంటే  వీదుల్లో వెళ్ళేవారిని కరుస్తాయని కావచ్చు, లేకపోతే వీదుల్లోకి వెళ్లి తోటి కుక్కలతో గొడవపడి , తిరిగి అవి దాడికి దిగితే మన కుక్కకే నష్టం కాబట్టి . ఇక్కడ నాకెందుకో ఇంట్లో కొడుకు బుద్ది , కుక్క బుద్ధి ఒకటే అనిపిస్తుంది.  కుక్కకు కొంచం సందు దొరికితే రయ్యిన వీదిలోకి వెళుతుంది . తోటి కుక్కలతో గొడవపడే ముందు దానికి ఇల్లు గుర్తుకు రాదు. కాని పది కుక్కలు వెంటపడితే మాత్రం అప్పుడు ఇల్లు గుర్తుకు వచ్చి, ఆదరా బాదరా ఇంట్లోకి పరుగెత్తుకు వచ్చి , ఇంట్లో జొరపడి మూలన నక్కి అరుస్తుంది . అప్పుడు ఇంటి కుక్క రక్షణ యే ద్యేయంగా , ఆ వీది కుక్కలను తరిమి వేయాల్సి వస్తుంది . ఇది కుక్క కాబట్టి O.K , మరి అదే కొడుకు అయితేనో?

    అమ్మాయిలతో తిరిగేటప్పుడు , వారిని ప్రేమించేటప్పుడు, ఇంట్లో వారి అనుమతి లేకుండా వారిని రహస్య వివాహాలు చేసుకునే టప్పుడు , అమ్మా బాబులు అస్సలు గుర్తుకు రారు. కాని మోజులన్ని తీరాకా , ప్రేమించిన అమ్మాయే పెను భారం అనిపించాకా , ఆమెను వదిలించుకోవడానికి ఠక్కున ఇల్లు గుర్తుకు వస్తుంది . వేంటనే వచ్చి తల్లితండ్రుల శరణు  కోరితే, వారు చూస్తూ , చూస్తూ కొడుకుని వదులుకోలేరు కాబట్టి , తమ రక్షణలో ఉంచుకుంటారు . మరి అమ్మాయి , ఆమె తరపు వారు ఊరుకుంటారా? ఈదేశమ్లో ప్రేమించి పెండ్లాడానికి అమ్మానాన్నల అనుమతి అక్కర్లేదు , అలాగే ఇంటి ముందు ధర్నాలు చేయడానికి పోలిసులు అనుమతి అక్కర్లేదు కాబట్టి , వేంటనే అనుమతి పొందని అత్తవారింటి ముందు టెంట్ వేసి ధర్నా చేస్తుంటే , ఆ వీదిలో వారికే కాదు మీడియా పుణ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా , ఆ కుటుంబానికి యమ పబ్లిసిటి! ఆ తర్వాత సెటిల్మెంట్ పేరుతో ఎంతో కొంత వదిలించుకుని , కొడుకు ప్రేమ తంతుకు మంగళం పాడేసి , మమ అనేస్తారు .

   అందుకే అనేది ! ఇంటి కుక్క అయినా , ఇంట్లో కొడుకు అయినా అదుపులో ఉంచుకోవాలి . ఒక వేళ అదుపు తప్పితే , వారికి కుటుంబ సపోర్ట్ ఇవ్వరాదు. ఇస్తే ఇంటి పరువు మర్యాదలతో పాటు , ఆర్దికంగా కూడా నష్టపోవడం ఖాయం.ఎవరు ఎన్ని సుద్దులు చెప్పినా , ఇంట్లో పిల్లలని చూస్తూ , చూస్తో , కష్టాల్లో వదిలేయలేం అనుకుంటే , ":వివాహాలకు తల్లితండ్రుల అనుమతి తప్పని  సరి చేసేలా ప్రభుత్వాలను కోరండి . అప్పుడు కనీసం ఇంటి ముందు ధర్నాలు చేయించుకుని పరువులు తీసుకునే పరిస్తితి రాదు. ఇదే విషయం గురించి నేను ఇంతకు ముందు పెట్టిన టపాలను చూడండి .

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన                          (11/12/2014 Post Republished).

Tuesday, 18 October 2016

తెలంగాణా లో R.I లను గిర్దావర్ లుగా మార్చినోళ్లు , S.I లను రజాకార్ లుగా మారుస్తారేమో !!?

                                                               
భవిష్యత్ లో తెలంగాణా రెవిన్యూ జాబ్స్ నోటిఫికేషన్ పాకిస్తాన్ లో మాదిరి ఇలాగే ఉండబోతుందా ? 


                                     ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయేటప్పుడు తెలంగాణా అభివృద్ధి గురించి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి .ఆ అనుమానాలను పటాపంచలు చేయడంలో సపలమయ్యారు తెలంగాణా ముఖ్య మంత్రి శ్రీ కలువకుంట్ల చంద్ర శేఖర రావు గారు.అయితే కొన్ని తెరచాటు వర్గాలు ఆయన్ని ఎలా అయిన అప్రతిష్టల పాలు చేయాలని చూస్తున్నట్లు ఉన్నాయి. అందులో భాగంగా తమ ఇష్టాలను ప్రజల మీద రుద్దుతూ ఇదంతా ముఖ్యమంత్రి గారి ఇష్ట ప్రకారమే జరుగుతున్న దని.ప్రజల్ని నమ్మిస్తూ వారిని నోరెత్త కుండా చేస్తున్నారు.అందులో భాగమే ఇటీవలి రెవిన్యూ అధికారుల హోదా పేర్లు మార్పు విషయం.

     జాగీర్దారీ భూస్వామ్య నిరంకుశత్వంలో శతాబ్దాలుగా పీడనకు గురి అయిన తెలంగాణా ప్రజలు, భారత దేశానికీ స్వాతంత్య్రం సిద్దించాక కూడా తమకు స్వాతంత్య్రం దొరకక మరొక స్థానిక స్వాతంత్ర్య పోరాటం చేయాల్సి వచ్చింది . ఆ పోరాటాన్ని అణచివేయడానికి ఆ నాటి నిజాం ప్రభుత్వం "రజాకార్ " అనే జిహాదీ గ్రూపులను తయారు చేసి  ప్రజలను ఊచకోత కోయించింది . ఆ అరాచక పాలనను అంతం చేయడానికి చివరకు భారత ప్రభుత్వం మిలటరీ ఆపరేషన్ కు ఆదేశించడం తో నిజాం లొంగిపోయి తెలంగాణను కూడా స్వతంత్ర భారతం లో భాగం చేయటం జరిగింది. ఈ  సంఘటనలు కళ్లారా కాంచిన వృద్దులు కొంతమంది ఈ  నాటికి   తెలంగాణలో సజీవ సాక్ష్యాలుగా మిగిలి ఉన్నారు.

   తెలంగాణలో ప్రజలను అణచివేసి భూస్వాముల అడుగులకు మడుగులొత్తేలా చేయడం లో సఫలీకృతమైన వ్యవస్థలు గ్రామంలోని పటేల్ మరియు పట్వారి వ్యవస్థ. పటేల్ గ్రామ పోలీసుగా వ్యవహరిస్తే , పట్వారి గ్రామ కరణంగా రెవిన్యూ పనులు చక్కపెట్టేవాడు. తెలంగాణలో ఈ నాటికి రెవిన్యూ రికార్డులు ఆంధ్రాలో మాదిరి సక్రమంగా లేకపోవటానికి  కారణం నాటి పట్వారీల రెవిన్యూ రికార్డుల రాతల మెళుకువలను ఆ తర్వాత వచ్చిన రెవిన్యూ అధికారులు కొనసాగిస్తూ ఉండడమే.రైతు రికార్డు ప్రకారం ఒక సర్వే నంబర్ లో ఉంటె , వాస్తవంగా మరొక సర్వ్ నంబర్ భూమిని సాగు చేస్తూ ఉండడం ,  భూమి  వాస్తవ అధీనం లో ఒకరు ఉంటె , మరొకరి పేరు ఎక్కించడం , ఆ పేరు ఎక్కిన వారు  వారి పేరు మీద బ్యాంకు లో లోన్ లు తీసుకోవడం లాంటి జిమ్మిక్కులు,  తెలంగాణా రెవెన్యూ రికార్డుల్ల చరిత్రలో కో కొల్లలు. దీనంతటికి మూల కారణం N.T.R గారి ప్రభుత్వం ఒక్క కలం పోటుతో పట్వారి వ్యవస్థను రద్దు చేయగలిగింది కానీ ,  రాష్ట్రం లోని భూములను రి సర్వే చేయించి, రికార్డులను రీ సర్వే  వివరాలతో వెరిపై చేయించి , సరి చేయించి  ఆంధ్ర ప్రాంతం లో మాదిరి ఒక క్రమ పద్దతిలో ఉంచడంలో మాత్రం విఫలమయింది . అందుకే ఆ తర్వాతి రెవెన్యూ ఆపీసర్లు సహితం పట్వారీల రికార్డులు ను పాలో అవటం తో పాటు వారి అలవాట్లను కూడా అనుసరించడం తో  తెలంగాణా ప్రజలు మనస్సులోనుంచి పట్వారి లు పూర్తిగా తొలగి పోలేదు సరి కదా " పట్వారీ వ్యవస్థే  నయం " అనే భావనకు కూడా వచ్చ్హారు .  


             మొన్నటికి మొన్న తెలంగాణా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్ర శేఖర్ రావు గారు తెలంగాణా రెవిన్యూ రికార్డులను ఒక క్రమపద్ధతిలో ఏర్పాటు చేయాలనే తలంపుతో ఎవరూ చేయని విదంగా ఉదార హృదయంతో 5 ఎకరాలు లోపు రైతులకు జూన్ 2 2014 వరకు రైతులు మద్య జరిగిన భూ కొనుగోళ్లు పత్రాలు అన్నింటిని  ప్రీ రిజిస్ట్రేషన్ ద్వారా క్రమబద్దీకరించి రైతులకు డిజిటల్ పట్టాదార్ పాస్ బుక్ జారీ చేయించాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ , పట్వారి భావజాల వారసులైన గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు అందుకు యదా శక్తి తమ మోకాలడ్డుతున్నారు. G.O ప్రకారం ఉచిత రిజిస్ట్రేషన్ అనేది పరాయి వాళ్ళ నుండి కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది తప్పా , కుటుంబ సభ్యుల మధ్య జరిగిన లావాదేవీలకు వర్తించదని సగం అప్లికేషన్ లు తిరస్కరించారు. అలాగే షెడ్యూల్డ్ ఏరియాలో 1970 తర్వాత జరిగిన  లావాదేవీలకు వర్తించదని మరో 40% అప్లికేషన్లు తిరస్కరించారు . ఇక మిగిలిన 5 నుండి 10% అప్లికేషన్ లు పరిష్కరించినా దాని వలన తెలంగాణా రెవెన్యూ రికార్డులు ఒక క్రమపద్ధతిలో ఏర్పడటం కలగానే మిగిలిపోనున్నది. ఇలా అస్త్యవస్థ రెవెన్యూయె రికార్డులు ఉన్నంతకాలమే  కదా  రెవెన్యూ అధికారులకు కాసుల పంట పండేది. 

    ఇక ప్రస్తుతానికి వస్తే ముఖ్యమంత్రి గారి సంచలనాత్మక నిర్ణయం వలన పరిపాలన వికేంద్రిరికరణ లో భాగంగా 10 జిల్లాల తెలంగాణా 31 జిల్లాల తెలంగాణగా రూపుదిదుకుంది. అందుకు ప్రజలు ఏంతొ  సంతోషిస్తున్నారు . కానీ ఒక విషయం లో మాత్రం తెలంగాణా ప్రజలకు బాధగా ఉంది. నిజాముల కాలం నాటి రెవెన్యూ అధికార వ్యవస్థల పే ర్లను తిరిగి ప్రవేశ పెట్టడం తిరిగి అలనాటి పీడనా తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేయడమే అవుతుంది తప్పా దాని వలన ప్రజలకు ఒరిగేదేమి లేదు.మండలాలను తెహసిలుగా, ఎమ్మార్వో ని తెహసిల్దారుగా, డిప్యూటీ ఎమ్మార్వో ని నాయిబ్ తెహసిల్దారుగా, R.I ని గిర్దావర్ గా, రెవెన్యూ అసిస్టంట్ ను నాయిబ్ గిర్దావర్ గా వ్యవహరించాలని కోరుతూ ఉత్తర్వులు ఇస్తున్నారంట . ఇలా తెలంగాణా ప్రాంత గత పీడనా తాలుకు పేర్లను తిరిగి అధికారులకు పెట్టదం లో ఉన్న మతలబ్ ఏమిటి ? తెలంగానా రెవెన్యూ మంత్రి గారు నిజాం గారి సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి ఆయనగారికి ఇష్టం అని చెప్పి వాటిని  తెలంగాణా ప్రజల మీద రుద్దుతున్నారా?  లేక వెనుకటి నిజాం కాలం నాటి పట్వారీ వ్యవస్తనే అమలులొకి తెనున్నారా? దీని మీద రెవెన్యూ డిపార్త్మెంట్ వారు ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 

                                    ఇలా రెవెన్యూ అధికారులు పేర్లు మార్చి తమ ఉనికిని  చాటుకోవాలని తహ తహ లాడె తెరచాటు వర్గాలు, ఈ రోజు  R.I లను గిర్దావర్ లుగా మార్చినోళ్లు  , రేపు S.I లను రజాకార్ లుగా మారుస్తారేమో    అని అనుమానంగా ఉంది .   కాబట్టి తెలంగాణా రెవెన్యూ అధికారుల హోదా ల పేర్లు మార్చడం వలన ప్రజలకు ఏ విధంగా లాభమో రెవిన్యూ వర్గాలు చెప్పాలి . తెలంగాణా ముఖ్యమంత్రి గారు ఈ  విషయం లో   పునరాలోచన చేసి, తెలంగాణా ప్రజలుకు  గత కాలపు చేదు అనుభవాలను గుర్తు చేసే అధికార హోదాల పేర్లు కాక , అలవాటుపడిన   అమలులో ఉన్న పేర్లనే కొనసాగించాలని కోరడమైనది.   

రావణుడు చేత చెరచబడిన "రంభ "ల సంతానమా ఈ రచయితలంతా!!!?

                                                                         


                              చరిత్ర లేక ఏదైనా ఒక ఇతిహాసం మీద పరిశోదన చేసేవారికి నిక్ష్పాక్షిక ద్రుష్టి ఉండాలి. అలాంటి దృష్టితో పరిశొదనలు చేసి తమ అభిప్రాయాలను వెలిబుచ్చితే , వారు చెప్పే మాటకు కొంత విలువ వుంటుంది. అంతే కాని పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్న వారికి లోకం అంతా పచ్చగా కనిపించినట్లు, మనసులో ఒక బావం ముద్ర వేసుకుని , అదే బావం తో చరిత్రలను లేక ఇతి హాసాలను పరిసీలిస్తే , వారి మనసుల్లో పాతుకుపోయిన బావాలే అందులో కనపడతాయి తప్పా, వేరు రకంగా కనపడడానికి అవకాశమే లేదు. ఎవరికీ ఇష్టం వచ్చిన రీతిలో వారు రామాయణ , మహాభారతాలను విశ్లేషించే  స్వేచ్చా  స్వాతంత్ర్యాలు , ఈ దేశ రాజ్యాంగం తన పౌరులకి ఇచ్చింది కాబట్టి, ఎవరి రంగు కళ్ళ జోళ్ళు వారు పెట్టుకుని , వారికి కనిపించే విదంగా వారు విశ్లేషిస్తున్నారు . మరి నేను కూడా నా జోడు దరించి రామాయాణాన్ని పరిశీలిస్తే  ఈ   క్రింది విదంగా అనిపించింది.

                                 రామాయణం అనేది భారతదేశం లో మెజార్టీ  ప్రజలు యొక్క ఆరాదనీయ గ్రందం. దానిని రచించించినది వాల్మీకి అనే మహర్షి గా మారిన   ఒక బోయ వాడు.ఈ   దేశం లో దళితులూ రాసేదంతా దళిత సాహిత్యమే  అని అనుకున్నట్లు   అయితే రామాయణం కూడా  మొట్టమొదటి దళిత సాహిత్యమే అవుతుంది.అప్కోర్స్ అప్పటికి దళిత అనే పదం లేదనుకోండి. కొంత మంది పరిశొదకులు ప్రకారం ,విష్ణువు , ఇంద్రుడు అనే వారు ఆర్య రాజులు అంట. అయితే అర్యులును గుర్తించాలంటే బండ గుర్తు ఏమిటంటె , వారిలో ఎక్కడా నలుపు అనేది ఉండదు అంట . మరి ఈ రూల్  అప్ప్లై చేసినప్పుడు ఇంద్రుడు ఆర్యుడు అవుతాడు కాని, నల్లగా ఉన్న విష్ణువు కాని అయన అవతారాలు కాని ఆర్యులు ఎలా అవుతారు? 

                  రామాయణo  లో    హీరో రాముడు నల్లని వాడు. కాబట్టి దళిత రూల్ ప్రకారం రాముడు ఆర్యుడు కాడు అని డంకా బ జాయించి చెప్పవచ్చు. రామాయణ కాలం నాటికే రాజవంశ ముఖ్యులలో  నల్లటి వారు , ఎర్రటి వారు అన్నదమ్ములుగా ఉన్నారు అంటె , అప్పటికే ఆర్యులు , అనార్యులు కలిసిపోయిన మిశ్రమ సమాజం ఏర్పడి ఉండాలి లేదా ఆర్యులు అనార్యులు అనే విభజన సిద్ధాంతమే తప్పుడుది అయి ఉండాలి . అటువంటప్పుడు రామాయణ కాలం నాటికే సమాజం లో ఉనికిలో లేని  ఆర్య, అనార్య బేదాలు వారికి ఆపాదించి ,వక్రద్రుష్టితొ విశ్లేషణలు చేయడం సరి కాదు. నా ఉద్దేశ్యం ప్రకారం రామాయణ మహా కావ్యం యొక్క ఉద్దేశ్యం మానవ ధర్మాలను, అందులో బాగంగా రాజ ధర్మాలను గురించి చెప్పడమే కాని, అప్పటి రాజుల మద్య వైషమ్యాలు , యుద్దాలు గురించి చెప్పడం కాదు. 

                                 రామాయణo  అంటె రాముడు నడిచిన దారి అని అర్దమ్. ప్రతి మనిషి కి రాముడు నడచిన విదానం యొక్క ఆవశ్యకత ,విశిష్టతను  తెలియచేయడమే  రచయిత అయిన వాల్మికి మహర్షి ఉద్దేశ్యం అయి ఉండాలి . రాముడు పుట్టుక మొదలు ప్రాణ త్యాగం వరకు ఒక పద్దతి ప్రకారం జరిగింది. ఇందులో పితృ దర్మం , పుత్ర దర్మం, బ్రాత్రు దర్మం ,పతి ధర్మం, సతి దర్మం, రాజధర్మం , సేవక ధర్మం, ఇలా చాలా ధర్మాలు గురించి చాలా చక్కగా  వివరించిన గ్రంధం రామాయణం .  అధికారాలకంటె  రాజులకు ధర్మరక్షణె ముక్యమని ప్రబోదించిన మహా కావ్యమ్. రాముడు తన తల్లితండ్రులకు "మనువు " (వైవాహిక ) పద్దతిలో జన్మించిన వాడు కాబట్టి , అవతార పురుషుడు అయినా  "మనుజుడై " మానవ ధర్మాన్ని పాటించాడు . తండ్రి మాట కోసం కానలకేగి అష్ట కష్టాలు పడ్డాడు . సతి పతులు అంటే  వేరు  వేరు  శరీరాలతో ఉండె ఏక మనస్కులు అని , ఒకరికి ఒకరు సుఖ దుఃఖాలలో తోడు నీడగా ఉండటమే నిజమైన దాంపత్యం అని నిరుపించటానికే అవతార మూర్తులైన ఆ దంపతులు అరణ్యవాసం చేసారు. సతి పతుల మద్య అన్ని బందాలు కంటె ప్రేమ బందమే గొప్పదని రుజువు చేసారు. ప్రజా వాక్కు కు వెరచి  సీతమ్మను అడవులకు పంపినా నిత్యం ఆమె విరహః వేదనలో బాదపడ్డాడే  కాని , మరొక స్త్రీని కన్నెత్తి చూడలేదు శ్రీ రాముడు.  ఈ విదంగా రామాయణం మొత్తం పరిసీలిస్తే "ఏక దంపతి వివాహ o " విశి ష్టతను  తెలియచేయడమే  వాల్మీకి ఉద్దేశ్యo  అనిపిస్తుంది.  
          
                 ఇకపోతే ఇందులో విలన్ కారెక్టర్ చూదాం .. విలన్ రావణాసురుడు . అతడి పుట్టుకే సరి అయిన పుట్టుక కాదు. అతని తల్లి కైకసి కేవలం సంతాన కాంక్షతో , ఒక బ్రాహ్మణుడిని చేరి , అతని వలన దశ కంటుడికి జన్మనిస్తుంది . అంటే రావణుడిది  "మనువేతర జన్మ" . కాబట్టి అతడు మనుజుడు కాడు. రాక్షస స్త్రియో , క్షత్రియ స్త్రియో , తల్లి కేకసి ఎవరైనా, తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ కూడా , రావణుడు పుట్టిన విదానం కాని, పుట్టిన ఘడియలు కాని కరెక్టు కానందున , జన్మతః బ్రాహ్మణుడైనా , రాక్షస గుణాలను పుణికి పుచ్చుకుని రాక్షసుడైనాడు. రాముడు నడిచింది ఒక పద్దతి ప్రకారం ఉంది కాబట్టి , తన హీరో పేరు మీద అది కావ్యానికి :రామాయణమ్ " అని పేరు పెట్టాడు వాల్మీకి . కొందరు అంటున్నట్లు  రావణుడే  ఇందులో హీరో అయితే  ఈ  కావ్యానికి  రామాయణం  పేరు బదులు "రంకాయణమ్ " అని పేరు పెట్టాల్సి వచ్చేది. 

                             నిజమే మరి! రావణుడు పుట్టుక మొదలు చచ్చిందాక అయన నడిచిన దారే అది. అతడు వెళ్లే దారిలో అతను చేసిన ఘనకార్యాలు ఏమిటి ?  కనపడిన  అందమైన స్త్రీల నల్లా చెరచడమే అతడి పని. మగాళ్ళను చంపడం, అడాళ్ళను చెర్చడం ఇదే అతడికి తెలిసిన ధర్మమ్. అందులో ఆ  జాతి , ఈ  జాతి అని ఏమి లేదు, కంటికి నచ్చినది ఎవరైనా సరే చెరబట్టి నాశనమ్ చేయాల్సిందే. అందులో దేవ జాతికి చెందిన రంభ కూడా ఉందట. ఇలా దేవ, దానవ, ముని, మానవ స్త్రీలు చెరచబడుతుంటె , ఆ రాక్షసుడు  నడచిన దారి అంతా హాహాకారాలతో అల్లాడుతుంటే  , వాడిని చంపటానికి అవతారపురుషుడు  రావడం  అవసరం కాదా? దానికి ఆర్య , అనార్య గొడవలుకి సంబందం ఎమిటి?   అటువంటి శాడిస్ట్ , రేపిస్ట్ ను పట్టుకుని అయన మా మూలపురుషుడు, మా జాతి రత్నం, అని చెప్పుకోవడానికి  కొంచం అయినా బిడియ పడాల్సిన పనిలేదా? పంచభూతాలను కంట్రోల్ చేయగలిగిన విజ్ఞాన వేత్త  అయినా  సరే పంచేద్రియాలను కంట్రోల్ చేసుకోలేక పోతే , చరిత్ర హీనుడు అవుతాడు అని రావణ చరిత్ర  ద్వారా చాటి చెప్పిన ఇతిహాసమే రామాయణం. రామాయణ కర్త ఉద్దేశ్యం గ్రహించకుండా, అందులో పరమ కర్కోటక , రేపిస్ట్ ను పట్టుకుని "అయన మా తాత. , మేమంతా అయన వారసులం" అని చంకలు గుద్దుకునే రచయితలను చూసి ఏమనాలో అర్దం కావటం లేదు. బహూశా రావణుడు చేత చెరచబడిన రంభల తాలూకు వారసులు కాబోలు ఆయన్ని హీరోగా చేసి రచనలు చేస్తున్న వారంతా! తాత ఎంత దుర్మార్గుడైనా , తమలో ఉన్నది  కూడా అయన DNA కాబట్టి , ఆ అభిమానం ఒలక బోస్తున్నట్లుంది. పాపం! రావణుడు  రంభలనే కాదు, చివరకు అయన వారసుల మెదళ్ళ ను  కూడా చెఱచి  వేసాడు. 


    ఏది ఏమైనా రావణాసురిడి గురించి ఎంత పాజిటివ్ గా చెపితే అంతగా లాభపడేది శ్రీ లంక టూరిజం డిపార్త్మెంట్. ఈ  మద్య వారు  రావణాసురుడి  ఆనవాళ్ళు గురించి తెగ ప్రచారం చేస్తూ , అదిగో గద, ఇదిగో కాలిజాడ అని టూరిస్ట్ లను తెగ ఆకర్షిస్తూ  తమ ఆదాయం పెంచుకుంటున్నారు అట. మన దేశం లోని రావణ భక్తులు అంతా వారిని సంప్రదిస్తే , వారి టూరిజం శాఖలో మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వవచ్చు. అలా తమ తాత  ఘన త ను కీర్తిస్తూ హ్యాపీగా లంకలో గడిపేస్తే పోలా !ఇక్కడ ఉండి హిందువుల మనో బావాలు  గాయపరచే రచనలు చేసే కంటె అది బెటర్ కదా!

                                             (16/10/2015 Post Republished). 
       
   

Saturday, 15 October 2016

మట్టికుండ కోసం గొర్రె ని కోసి గోడని కూల్చిన కధ ను గుర్తుకు తెచ్చిన "బోరు బావిలో గిరిజ" ఉదంతం !

                                                                   
     


గత మూడురోజులుగా రంగారెడ్డి జిల్లాలో  మంచాల గ్రామంలో జరుపుతున్న బోరు బావి రెస్క్యూ అఫరేషన్ గమనిస్తుంటె నిజంగా మన అధికారులు ఇంత మానవత్వం ఉన్న వారా అని ఆశ్చర్య పోవాలో లేక ఇంత పాగల్ గాళ్ళా అని నిర్ఘాంత పోవాలో అర్ధం కాకుండా ఉంది. వేల కిలోమీటర్లు దూరం నుండి వేగంగా దూసుకు వస్తున్న హుడ్ హుడ్ తుపాన్ ఎక్కడ తీరం దాటుతుందో చెప్పగలిగే అంత టెక్నాలజి ఉన్న మనకు నీరున్న బోరు బావి లో పడిన నాలుగేళ్ల పాప బ్రతికి ఉందా? లేదా ? అని నిర్దారించే టేక్నాలజి లేదనుకోవడం అమాయకత్వమే అవుతుంది. మరి అటువంటి  టేక్నాలజి  ఉండి కూడా మూడు రోజులు రేయింబవళ్ళు, మన ఘనత వహించిన అధికారులు, ఒక మంత్రి గారి పర్యవేక్షణలో 13 జే సి.బి లు ఉపయోగించి  సుమారు ఎకరం భూమిని నాశణం చేసి చివరకు పాప చని పోయిందని సి సి. కెమేరాలు ద్వారా నిర్దారించి చెప్పడమ్ లో గల అంతర్యమ్ ఏమిటి  అనేది అంతుబట్టని విషయమే. వివరాలు లోకి వెళితే
                                                                     

   ఒక తాత, అమ్మమ. . వారికి కొంత భూమి ఉంది. అందులో బోరు వేసారు. నీరు పడలేదని బోరుని వాడటం  లేదట. అయినా దాని మీద ముళ్ళ కంప వేసారు. అయితే వారం క్రితం ఆ ముళ్ల  కంప తీసి వేసార ట . ఒక రోజు తల్లిని కోల్పోయిన తమ కూతురి కోడుకు మరియు  కూతురిని అక్కడికి తీసుకు వెళ్ళి  ఆ బోరు దగ్గర ఆడుకోవటానికి వదిలి వెళ్ళారట. పాపం ఆ ముసల్లి వాళ్ళకి ఆడపిల్ల పెంపకమ్ బారం గా మారుతుందనుకున్నాడొ ఏమో ఆ దేవుడు ఆ పిల్లలో ఆడపిల్లని(గిరిజ ),  మాత్రమే బోరు బావిలో పడెలా చేసాడట. అది చూసిన ఆ పిల్ల అన్న ఆ విషయమ్ తన తాత అమ్మమ్మలకు చెపితే, వారు అధికారులకు సమాచారమ్ ఇస్తే, సదరు అధికారులు మంత్రి గారి పర్యవేక్షణలో  మొన్న అదివారం నుంచి శ్రమించి, తాత గారి ఎకరం భూమి గుల్ల చేసినాకా , పాప చని పోయి నీళ్లల్లో పడి ఉందని తేల్చారట. ఇందులో ట్విస్ట్  ఏమిటంటె పై నుంచి బోరు బావిలోకి టార్చ్ పోకస్ చేసి చూసినా  లోపల నీరు స్పష్టంగా కనపడుతున్నాయి. అంతే కాకుండా ఒక బక్క పలుచని వ్యక్త్ కాళ్ళకు తాడు కట్టుకుని లోపలకి వెళ్ళగలిగే అంతగా ఉంది ఆ బోరు బావి..  మరి అటువంటి బావిలోకి సి .సి. కెమెరాను పంపి కూడా పాప కన పడటం లేదని చెప్పటం, 5౦ అడుగులు తవ్విన తర్వాత తిరిగి సి.సి. కెమెరా ద్వారే పాప చని పోయి ఉందని నిర్దారించడమ్ చూస్తుంటె ఈ ఆపరేశన్ జరిపించడం వెనుక మానవత్వమ్ ని మించిన మతలబ్ ఏదొ ఉందని అనిపిస్తుంది . ఏదైనా విషయం ఒక పాప ప్రాణం గురించి  కాబట్టి దీనీని ఎవరూ ప్రశ్నించలేక పోవచ్చు. కాని ఈ ఉదంతమ్ లో బాద్యుల నిర్లక్ష్యం , అనవసర హంగామ కు అయిన ఖర్చు, కాలయాపన మీద విచారణ జరిపితే మనకు తెలియని  కొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశ ముంది.

   అయితే ఈ ఉదంతం మొత్తం గమనిస్తుంటె, చిన్నప్పుడు నేను చదువుకున్న ఇంగ్లీస్ పాఠం లోని కధ గుర్తుకు వచ్చింది. అధి ఏమిటంటె

   ఒక రైతు ఇంట్లోకి ఒక గొర్రె ప్రవేసించింది. ఆ ఇంత్లో ఒక మట్టికుండలో కొంత దాన్యం ఉంటె దానిని తినాలనుకుని ఆ కుండలొ తల  పెట్టడం తో,  గొర్రె  తల కుండలో ఇరుక్కు పోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఆ రైతుకి తన గొర్రె తలని కుండ  లోనుండి బయటకు తీసి రక్షించడమ్ ఎలాగో తెలియక చుట్టు ప్రక్కల వారిని పిలిచి సలహా అడుగగా, ఎవరూ ఏమి సలహా ఇవ్వలేక పోవడంతో, ఏమి పాలుపోక కంగారు పడి పోసాగాడు ఆ రైతు. అంతలో ఒక గొప్ప వ్యక్తిలా కనిపించే ఒక వ్యక్తి ఒంటె మీద వీదీలో వెళుతూ కనిపించగా, అక్కడ చేరిన  వారు ఆ రైతు తో,  ఆ వ్యక్తికి విషయం చెపితే అతను ఉపాయమ్ చెప్పవచ్చు అన్నారు  దానితో ఆ రైతు వీదిలోకి వేళ్ళి ఆ ఒంటే మీద వెళు తున్న వ్యక్తిని తన ఇంట్లోకి వచ్చి తన సమస్యను పరీలించి సలహ చెప్పవలసిందిగా కోరాడు. దానికి ఆ పెద్ద మనిషి " నేను ఒంటె దిగి లోపలకు రాలేను, నేను ఒంటె తో సహా లోపలకు రావాలంటె నీ ఇంటి గోడ అడ్డంగా ఉంది .ఎలా మరి?" అని అనగా , వెంటనే ఆ రైతు మరియు చుట్టు పక్కల వారు గడ్డపలుగులతో రైతు ఇంటి గోడ ను పగుల గొట్టగా, ఠివిగా ఒంటె తో సహ ఇంట్లోకి ఏతేంచిన ఆ వ్యక్తి కుండలో ఇరుకున్న గొర్రె ముఖాన్ని చూసి , " ఒరి పిచ్చోళ్లారా ఇంతోటి  దానికి వేరే ఆలోచించాలా " అని చెప్పి ఒక కత్తిని తీసుకు రమ్మన్నాడు. రైతు కత్తి తీసుకు రాగా దానితో ఒక్క వేటున ఆ గొర్రె తలని నరికి రైతు చేతిలో పెట్టాడు. దానితో ఆ రైతు అమాయకంగా  " మరి కుండలో ఉన్న తల ఎలా స్వామీ అనగా, అదే కత్తి  తో ఒక్క దెబ్బకు కుండను పగుల గొట్టి  గొర్రె తల ను రైతు చేతిలో పెట్టాడు . దానితో   అక్కడ ఉన్న జనం అందరూ హర్షద్వానాలు చేస్తుండగా, సదరు గొప్ప వ్యక్తి తన ఒంటె ఎక్కి చక్కా వేళ్ళి పోయాడు. ఆ రైతుకు చివరకు మిగిలింది ఏమీటంటే పగిలిన కుండ, చచ్చిన గొర్రె, పగిలిన గోడ. అదీ కద

  పై ఉదంతం లో మన అదికారులు చేసిన పని కూడా అచ్చంగా కదలో పెద్ద మనిషి చేసినట్టె ఉంది కధా! ఇదే విషయం మీద మరిన్ని వివరాలకు క్రింది వీడియోను చూడండి .  ఏది ఏమైనా పెద్దల  నిర్లక్ష్యానికి గురి అయి మరణించి న చిన్నారి గిరిజ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్దిస్తూ  ........ ....         


                        
                  

                                                         (14/10/2014 Post Republished).

Friday, 14 October 2016

ఆ ఆయుర్వేద వైద్యుడి చేతిలో మోసపోయిన R.K న్యూస్ చానల్ సంబందిత మహిళలు ఎవరు?

                                                                       


                     కొన్ని మీడియా చానళ్ళ ప్రసారాలు చూస్తుంటే అవి సమాజ ఉద్దరణకు పనిచేస్తున్నాయా , లేక తమ చానల్ రేటింగ్ ల కోసం ఎవరో ఒక ప్రముఖుడుని టార్గెట్ చేసుకుని రెండు మూడు రోజులు ఊదరగొట్టి , తాము ప్రసారం చేసిన కధనాలను ఆదారం చేసుకుని ఎవరైనా మీడియాలో కనపడాలనే తపనతో చేసిన వ్యాఖ్యానాలు ప్రసారాలు చేస్తూ , రాష్ట్రమంతా తమ చానల్ వలనే చైత్యన్యమవుతుంది అన్న అభిప్రాయం ప్రజలలో కలుగ చెయ్యడానికి పని చేస్తున్నాయా అనిపిస్తుంది. .

                       ఉదాహరణకు R.K.  న్యూస్ చానల్  వారు గత 3 రోజులుగా , ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఏల్చూరి గారి గురించి ఒక కదనం ప్రసారం చేస్తున్నారు. దానీ సారాంశం ఏమిటంటే ఏల్చూరి ఆయుర్వేదం వైద్యం పేరుతో తన దగ్గరకు వచ్చే మహిళలను లైంగికంగా లొంగదీసుకుంటున్నాడు అని. దీని తాలూకు ఒక వీడియోను కూడా  చానల్ వారు చూపిస్తున్నారు. అయితే అందులో ఉన్న పురుషుడు ఎవరు అనేది స్పష్టంగా లేదు. కానీ ఆ  విడియో మీద ఏల్చూరి గారు కూడా  ఎటువంటి ప్రతిస్పందన తెలియపరచటం లేదు కాబట్టి అది ఆయనకు సంబందించిన విడియో యే అనుకుందాం. అయితే అతనితో సరాగాలు ఆడుతున్న స్త్రీ తన ఇష్టపూర్వకంగానే అతనితో కలిసి ఉన్నట్లు అర్దమవుతుంది. అ సీన్ వైద్యశాలలో జరిగినదా , లేక అతని ప్రైవేట్ రెసిడెన్స్ ప్రాంతంలో జరిగిందా తెలియటం లేదు. కానీ ఆ వీడియో ని చానల్ వారు జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో చిత్రీకరించినట్లుంది. దానిని ప్రసారం చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా తమ చానల్ కు అభినందనల వెల్లువ ముచెత్తుతుందని చానల్ వారు చెప్పుకుంటున్నారు. కొంతమంది మహిళా సంగాల నాయకురాళ్ళు కామెంట్లు తమ చానల్ ను కీర్తిస్తూ , ఎల్చూరిని విమర్శిస్తూ చేసినవి ప్రసారం చేస్తూ , ఒకటే ఊదరగొడుతున్నారు. దీనికి ఏల్చూరి గారు ఏమి స్పందించటం లేదంటే ఆయనకు మనసులో ఎక్కడో తనకు ఆ  రకం "నెగటివ్ పబ్లిసిటి " కూడా లాభదయకమే అని అనుకుంటున్నట్లు ఉంది.

   నిజంగా స్త్రీల పట్ల ఎవరైనా అసబ్యంగా ప్రవర్తించినా , వైద్యం పేరుతో వారిని లైంగికంగా వేదించినా ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే చాలు. చట్టం నిర్భయంగా అటువంటి వారి పని పడుతుంది. కానీ బాదిత మహిళలు ఎవరూ తాము వేదింపులకు గురి అయ్యామని ముందుకు రానప్పుడు, వారి తరపున వకాల్తా పుచ్చుకుని రాష్ట్రమంతా రచ్చ రచ్చ చెయ్యడం ఎంతవరకు సమంజసం? అసలు జరిగినదేమిటో తెలుసుకోకుండా మీడియా వచ్చింది కదా అని ఏవేవో కామెంట్లు చేస్తే , రేపు ఆ బాదిత స్త్రీలు  తమ ఇష్టప్రకారమే  జరిగిన ప్రైవేట్ వ్యవహారం అంటే ఏమిటి పర్యవసానం? ఆయుర్వేద వైద్యుడు ఎవరితోనైనా లైంగిక సంబందాలు కలిగి ఉంటే అది అతని బార్యకు జరిగే నష్టం. దాని గురించి ఆవిడ గారు ఆలోచించాలి. అంతే  కానీ రాష్ట్ర మంతా గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఒక వేళా వైద్యానికి వచ్చే స్త్రీలతో , వైద్యశాలలో అయన అసబ్యంగా ప్రవర్తిస్తుంటే తగిన సాక్ష్యాదారాలతో చానల్ వారు సంబండిత వైద్య విభాగ అధికారులకు తెలియ చేసి అతని గుర్తింపు సర్టిపికేట్ ను రద్దు చేయించవచ్చు. అంతే కానీ వరుసగా చెప్పిందే చెప్పి ఊదరగొట్టడం లో అసలు ఉద్దేస్యం చానల్ రేటింగ్ కోసమైనా కావాలి, లేదా అది ఆపడానికి తగిన ప్రతిపలం కోసం ఆశిస్తూ అయినా ఉండాలి.

     స్త్రీ బలహీనత అన్నింటిలో పరమ నీచమైనది. ఎంత గొప్ప వ్యక్తీ అయిన దీన్ని జయించలేక అదమాదమ స్తాయికి పడి పోతున్నాడు. స్టింగ్ ఆపరేషన్ చేసే వారంతా పరమ పవిత్రులు కారు. దీ గ్రేట్ తెహెల్కా అధిపతి తేజ్పాల్ ఉదంతం చూసిన తర్వాత అయినా బలహీనత ఉన్న మగవాళ్ళు బుద్ది  తెచ్చుకుంటే మంచిది. ఆవుర్వేడ వైద్యమైనా , అల్లోపతి వైద్యమైనా సాద్యమైనంత వరకు స్త్రీలకు స్త్రీలు , పురుషులకు పురుషులు చేస్తేనే మంచిది. అందుకే కొన్ని , కొన్ని మత  సంస్తలు తమ కార్యాకలాపాలలో స్త్రీలకు నిషిద్దం ప్రకటించాయి. ఇది తప్పుడు అభిప్రాయమే అయినప్పటికి , ఇటీవల పెద్దవాళ్ళు అని పేరొందిన పురుషుల ఉదంతాలు చూస్తుంటే , అటువంటి నిబందనలు బవిష్యత్ లో తప్పవేమో అనిపిస్తుంది. నిజంగా అసలు జరిగిన విషయం ఏమిటో ఇప్పటికైన ఏల్చూరి గారు ప్రకటిస్తే బాగుంటుంది.
                                                          (22/12/2013 Post Republished).